Konda Surekha: వరంగల్ జిల్లాల్లో కొండా దంపతులు అంటే కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే కొండా దంపతులు. ఇప్పుడు ఆ కొండా దంపతులు అంటేనే జిల్లా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ శ్రేణులకు, కొండా దంపతుల మధ్య వివాదం రోజు, రోజు కు ముదిరిపోతోంది. చివరకు జిల్లా కాంగ్రెస్ పంచాయితీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ వద్దకు చేరుకుంది.
కొండా దంపతులు కావాలా, మేము కావాలో తేల్చుకోవాలంటూ కూడా జిల్లా కాంగ్రెస్ శ్రేణులు అల్టిమేటం జారీచేశారు. ఫిర్యాదు మీనాక్షి నటరాజన్ తో సరిపెట్టుకోలేదు. ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. కొండా దంపతుల పై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు కాంగ్రెస్ పెద్దలు తీసుకోని నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ శ్రేణలు కూడా ఎదో ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి కనబడుతోందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
సమావేశాల్లో నాయకులకు, కార్యకర్తలకు విలువ ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని ఢిల్లీ పెద్దలకు జిల్లా పార్టీ శ్రేణలు కొందరు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయిస్తూ, గ్రూపులను పెంచి పోస్తున్నారని ఆరోపించారు. కొండా దంపతుల వలన వివాదాలు పెరుగుతున్నాయి, కానీ కార్యకర్తలకు ప్రశాంతత లేదంటూ ఫిర్యాదు చేశారు.
సీనియర్లకు పార్టీలో జిల్లాలో ఎక్కడ కూడా గౌరవం లేకుండా పోయిందని వాపోయారు. వాలు చెప్పిందే వేదమంటే ఎలా కుదురుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇదే పద్దతి కొనసాగితే కొద్దీ రోజుల్లోనే అసంతృప్తి వాదులంతా కలిసి ఎదో ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి కనబడుతోంది.