Student Visas: మన దేశ విద్యార్థులు చాలామంది అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని దరఖాస్తులు చేసుకుంటారు. ఇటువంటి వారి కోసం అమెరికా ప్రభుత్వం ఒక మంచి గుడ్ న్యూస్ తెలిపింది. తాజాగా విద్యార్థి వీసా దరఖాస్తులను అమెరికా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. కానీ ఈసారి ఈ ప్రక్రియలో కొత్త రూల్స్ అమలు కానున్నాయి. అమెరికా ప్రభుత్వం ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ వీసా దరఖాస్తుల ఏదైతే పేర్కొన్నారు దానికోసం మాత్రమే వీసాను వినియోగించాలని ఇతర వాటి కోసం దుర్వినియోగం చేయకూడదు అని కఠిన ఆదేశాలను జారీ చేసింది.
అమెరికా ఇమిగ్రేషన్ ఈ నేపథ్యంలో ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చిన వాళ్ళు తమ విద్యను మధ్యలోనే ఆపివేయడం లేదా అక్కడ శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలలో పాల్గొనడం వంటివి చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విద్యార్థి వీసా వ్యవస్థను ఈ కొత్త రూల్స్ మరింత పారదర్శకంగా మరియు క్రమబద్ధంగా నిర్వహించేందుకు బాగా ఉపయోగపడతాయని అధికారులు వెల్లడించారు.
విద్యార్థులు తమ విద్య అర్హతలతో పాటు ఆర్థిక స్తోమత అలాగే చదువుకు సంబంధించిన అన్ని ప్రణాళికలను వీసా దరఖాస్తు సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. అలాగే అమెరికాలో ఉన్న విశ్వవిద్యాలయాలు అడ్మిషన్ లెటర్ తో పాటు ఆర్థిక హామీలు వంటి ఇతర పత్రాలు కూడా తప్పనిసరిగా సమర్పించాలని అధికారులు తెలిపారు. అయితే అమెరికాలో ఉన్నత విద్య చదవాలని భావిస్తున్న వారి కోసం అమెరికా ప్రభుత్వ మళ్ళీ దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. కానీ కొత్త రూల్స్ ఈ ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేస్తాయని తెలుస్తుంది.