WhatsApp: వాట్సాప్ లో డిలీట్ అయిపోయిన మెసేజెస్ తిరిగి పొందాలనుకుంటున్నారా…వెంటనే ఇలా చేయండి

WhatsApp
WhatsApp

WhatsApp: ఈ మధ్యకాలంలో వాట్సాప్ వాడకం గణనీయంగా పెరిగిపోయింది. మెసేజ్లు, ఫోటోలు మరియు వీడియోలు పంపించడం దగ్గర నుంచి ప్రతి పనికి కూడా వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని మెసేజ్లు లేదా చాట్ డిలీట్ చేసేస్తాము. కానీ అలా డిలీట్ చేసిన మెసేజ్లను లేదా చాట్ ని కూడా తిరిగి పొందవచ్చు. అలా డిలీట్ చేసిన కొన్ని జాబ్స్ ను తిరిగి పొందడానికి వాట్స్అప్ అవకాశం కల్పించింది. వాట్సాప్ ఈ విధంగా డిలీట్ అయిన సమాచారాన్ని పొందడానికి గూగుల్ డ్రైవ్ లేదా ఐ క్లౌడ్ లో బ్యాకప్ చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తుంది.

ఒకవేళ మీరు మీ ఫోన్లో చాట్ డిలీట్ చేయకముందే దానిని బ్యాకప్ చేసినట్లయితే ఆ చాట్ లో మీరు తర్వాత కూడా సులభంగా తిరిగి పొందవచ్చు. దీనికోసం మీరు ముందుగా మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ ను అన్ ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత మీరు మీ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి వాట్సాప్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్ను ధ్రువీకరించండి. ఈ విధంగా చేయడం వలన మీరు మీ చాట్ వాట్సాప్ లో బ్యాకప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు డిలీట్ అయిపోయిన పూర్తి మెసేజ్లను తిరిగి పొందవచ్చు.

కానీ మీరు రికవరీ చేయాలంటే చాట్ డిలీట్ చేయకముందే బ్యాకప్ చేసుకుని ఉండాలి. ఒకవేళ గడువు ముగిసిన తర్వాత మీరు బ్యాక్అప్ చేసుకుంటే ఆ మెసేజ్ లు తిరిగి రావు. మీరు బ్యాకప్ చేసుకోవడానికి ముందుగానే మీ గూగుల్ డ్రైవ్ లో లేదా ఐ క్లౌడ్ లో ఎక్కువగా స్టోరేజ్ స్పేస్ ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now