WhatsApp Tips: ప్రతీ రోజు మనలో చాలా మంది వాట్సాప్ వినియోగిస్తూ ఉంటారు. ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం, చాటింగ్ చేయడం, వీడియో కాల్స్ చేయడం ఇలా ఎన్నో పనులకు ఇది ఉపయోగపడుతోంది. ఈ యాప్ తరచూ కొత్త ఫీచర్లు తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది.
అయితే వాట్సాప్‌లోని (WhatsApp) ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్ వల్ల కొన్నిసార్లు ఆసక్తికరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఎవరైనా మెసేజ్ పంపి, వెంటనే డిలీట్ చేస్తే, “ఎవరు ఏం రాశారు?” అని చూడాలనే కుతూహలం చాలా మందిలో ఉంటుంది. మీకూ అలాగే ఉంటే ఈ సింపుల్ ట్రిక్ మీకు ఉపయోగపడుతుంది.
డిలీట్ చేసిన వాట్సాప్ మెసేజ్‌లను ఇలా చూడొచ్చు
ఇది చేయడానికి మీరు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఫోన్‌లోని ఒక సెట్టింగ్ ఆన్ చేస్తే సరిపోతుంది.
ఏం చేయాలి?.
మీ ఫోన్‌లో Settings ఓపెన్ చేయండి. Notifications సెక్షన్‌కి వెళ్లండి. నోటిఫికేషన్ హిస్టరీ (Notification History) అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను వెంటనే ఆన్ చేయండి.
ఇలా చేస్తే ఏమౌతుంది?
ఈ సెట్టింగ్ ప్రారంభించిన తర్వాత, వాట్సాప్‌లో ఎవరైనా మెసేజ్ (Messages) పంపి వెంటనే డిలీట్ చేసినా, మీరు ఆ మెసేజ్‌ను 24 గంటలపాటు నోటిఫికేషన్ హిస్టరీలో చూడగలరు.
ALSO READ:మీకు ఐఫోన్ మొబైల్ ఉందా.. అయితే ఈ కొత్త ఫీచర్ మీకోసం
ఏ ఫోన్లలో ఈ ట్రిక్ పనిచేస్తుంది?
ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 11 లేదా దానికన్నా కొత్త వెర్షన్‌లలో ఉన్న ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది.
ఐఫోన్ యూజర్లు ఈ ఫీచర్ ఉపయోగించలేరు. కొన్ని ఫోన్లో ఆప్షన్లు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి మీ దగ్గర ఉన్న మొబైల్లో సెట్టింగ్ నోటిఫికేషన్ హిస్టరీ (Notification History) అని వెతికి ఈ ఆప్షన్ ఉంటే దాన్ని ఆన్ లో పెట్టుకోండి
తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం
ఈ ఫీచర్ ద్వారా డిలీట్ చేసిన మెసేజ్‌లు మాత్రమే చూడగలరు, డిలీట్ చేసిన ఫోటోలు లేదా వీడియోలు చూడలేరు. నోటిఫికేషన్ హిస్టరీలో 24 గంటల వరకు మాత్రమే మెసేజ్‌లు ఉంటాయి. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి. ఎవరు ఏ మెసేజ్ పంపి వెంటనే డిలీట్ చేశారో తెలుసుకోవాలంటే, మీరు కూడా ఈ సింపుల్ సెట్టింగ్ ను ఉపయోగించండి. తద్వారా డిలీట్ చేసిన మెసేజ్‌లు మిస్సవకుండా తెలుసుకోవచ్చు.
ALSO READ:ఇకపై వాట్సాప్ లో కూడా యాడ్స్.. ఎప్పటినుంచో తెలుసా ?