Kuberaa: కుబేర సినిమా చూస్తున్న సమయంలో.. ఊహించని ఘటన.. పరుగులు పెట్టిన జనం.. అసలేం జరిగిందో తెలుసా..!

Kuberaa
Kuberaa

Kuberaa: టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కథకు ముఖ్య ప్రాధాన్యత ఇచ్చే దర్శకులలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. హృదయాలకు హత్తుకునే కథలతో ఎమోషన్లతో సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ముందుంటారు అని చెప్పొచ్చు. అందమైన కథలను మరింత అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే రీసెంట్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమాలో తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించారు. అక్కినేని నాగార్జున కూడా కీలక పాత్రలో నటించిన కుబేర సినిమా ఈనెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకుంది.

కుబేర సినిమా తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించకండి. బ్లాక్ బస్టర్ హిట్ దిశగా ఈ సినిమా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి ఉందని సమాచారం. అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. అయితే కుబేర సినిమా థియేటర్లో చూస్తున్న సమయంలో ఒక ఊహించని సంఘటన జరగడంతో అక్కడి నుంచి అందరూ పరుగులు తీశారు. ఒక థియేటర్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా కుబేర సినిమా వీక్షిస్తున్న సమయంలో థియేటర్ సీలింగ్ ఊడిపోయి ప్రేక్షకులపై పడింది.

దాంతో అక్కడ కూర్చున్న చాలామందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో ముకుందా థియేటర్లో ఇటీవలే జరిగింది. ఈ థియేటర్లో కుబేర సినిమా సెకండ్ షో ప్రదర్శిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. దాంతో ఈ సినిమాను మధ్యలోనే ఆపేసి గాయపడిన వారికి ప్రథమ చికిత్సను అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now