Jagityala Dust: మెట్ పల్లి, మార్చి16 (ప్రజా శంఖారావం): లక్షకు పైగా బోనాలతో అంగరంగ వైభవంగా డప్పు చప్పుల నడుమ ఒగ్గు కళాకారుల ప్రదర్శనలతో, శివశక్తుల పునాకలతో, పోతరాజుల విన్యాసాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మల్లన్న స్వామికి బోనాలు సమర్పించారు. తెలంగాణలో అతిపెద్ద బోనాల జాతరగా పేరుపొందిన పెద్దపూర్ మల్లన్న క్షేత్రం భక్తజన సంద్రంమైంది. ఆదివారం మెట్ పల్లి మండలంలోని పెద్దపూర్ గ్రామంలో మల్లన్న బోనాల జాతర అంగరంగ వైభోగంగా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుండి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం భక్తజనసంద్రమైంది. బోనాల ఉత్సవాన్ని కన్నులారా తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. కోరిన కోరికలు తీరుస్తూ అందరినీ సల్లంగ చూడు స్వామి అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ఉపావాసలతో కుటుంబ సమేతంగా మల్లన్న స్వామినీ దర్శించుకొని పసుపు, గొర్రే పిల్లలను కానుకగా సమర్పించారు.
బెల్లం నైవేద్యాలతో ప్రత్యేక వంటకాలు:
భక్తులు ఆలయ ప్రాంగణంలో బెల్లం నైవేద్యం వండి మల్లన్న స్వామికి సుమారు లక్షకు పైగా బోనాలతో అంగరంగ వైభవంగా డప్పుచప్పుల మధ్య ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు, శివశక్తుల పునాకలు, పోతరాజుల విన్యాసాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ స్వామికి బోనాలు సమర్పించారు. శివశక్తుల పునకాలను, పూనకం వచ్చిన ఆలయ పూజారినీ తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఆలయం చుట్టూ రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
స్వామికి ఎమ్మెల్యే పట్టు వస్త్రాల సమర్పణ:
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎండ త్రీవత ఎక్కువగా ఉండటంతో భక్తులకు మంచినీటిని పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలు చేసిన పలు ట్రస్ట్, సేవ సంఘలను ఆలయ కమిటీని ఎమ్మెల్యే అభినందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటను ఘనంగా నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ లు భారీ బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు.