Women playing poker arrested: పేకాట ఆడుతున్న ఐదుగురు మహిళల అరెస్ట్

Playing Cards Arrest
Playing Cards Arrest

Women playing poker arrested: నిజామాబాద్ టౌన్, సెప్టెంబర్ 25 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పట్టణ కేంద్రంలోని ఒకటవటౌన్ పోలీసులు తొలిసారి పేకాట ఆడుతున్న మహిళలను అరెస్టు చేసి కొత్త రికార్డు క్రియేట్ చేశారు. బుధవారం ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి నగర్ నీలోఫర్ ఆసుపత్రి 4వ అంతస్తులో మహిళలు పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాలతో పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుండి ₹ 15,100 రూపాయలు, 4 సెల్ఫోన్లను స్వాధీనపరచుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ మహిళలు ప్రముఖ వైద్యుల సతీమణులని సమాచారం.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now