Yellareddy: ఎల్లారెడ్డి/గాంధారి, జులై 01 (ప్రజా శంఖారావం): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘం వద్ద యూరియా అందించడం లేదని రైతులు, భారతీయ కిసాన్ సంగ్ ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి లింకులు లేకుండా యూరియాను అందజేయాలని, యూరియా కుత్రిమ కొరత లేకుండా చేయాలని అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు సరిపడే యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి లింకు లేకుండా అంటే యూరియా బ్యాగులు కొంటే అదనంగా సంబంధిత వేరే బస్తాను అంటగట్టడం మానుకోవాలని, కేవలం యూరియాను అమ్మాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు పాల్గొనడం జరిగింది.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now