Kidnap: రెండేళ్ల బాలుని కిడ్నాప్ కలకలం..

Kidnap
Kidnap

Kidnap: మెట్ పల్లి, ఆగస్టు 13 (ప్రజా శంఖారావం): రెండేళ్ల బాలుడి కిడ్నాప్ స్థానికంగా కలకలం రేపింది. మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని దుబ్బాక వాడలో నివాసముంటున్న లక్ష్మి రాజుల రెండేళ్ల కుమారుడు శివను గుర్తుతెలియని దుండగులు బైక్ పై వచ్చి ఎత్తుకెళ్లడం స్థానికంగా భయాందోళనకు గురిచేసింది.

అప్పటివరకు అక్క అమ్ములు తో కలిసి పక్కనే ఉన్న రెండేళ్ల బాలుడు శివ కిరాణా షాప్ కు వెళ్తున్న సమయంలో అక్కను ఎడమర్చి దుండగులు కిడ్నాప్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సిసి టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. సమాచారం అందుకున్న మెట్ పల్లి ఎస్సై రాజు వివరాలను సేకరిస్తున్నారు

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now