December 13, 2024
SRSP Project Water
SRSP Project Water

SRSP PROJECT:ఎస్సారెస్పీలో రంగు మారిన నీరు..!

SRSP PROJECT: నిజామాబాద్ జిల్లా, ఆగస్టు 14 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ లోని నీరు ఆకుపచ్చ రంగులోకి మారినట్లు రైతులు తెలిపారు. దీంతోపాటు నీరు దుర్వాసన వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రాజెక్టు ఆయకట్టు కాలువల ద్వారా అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో ఉన్న నీరు ఆకుపచ్చ రంగులోకి మారడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కోసం విడుదలైన నీరు ఆకుపచ్చగా రావడంతో పంట పొలాలకు ఏదైనా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సమస్యను అధికారులు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!