Women protest for water: ఖాళీ బిందెలతో మహిళల నిరసన

Women's protest for water
Women's protest for water

Women protest for water: జుక్కల్, సెప్టెంబర్ 03 (ప్రజా శంఖారావం): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలో తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మంగళవారం మండల కేంద్రంలోని ఐదవ వార్డు ప్రజలు తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, గడిచిన నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని వార్డు ప్రజలు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. స్థానిక గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శికి తమ వాడు సమస్యపై పలుమార్లు విన్నవించిన ఫలితం లేదని వాళ్ళు వాపోయారు.

ఒకవైపు కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్న తాగునీటి కోసం తమకు తిప్పలు తప్పడం లేదని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే స్పందించి తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాలతో సాగునీరు పుష్కలంగా ఉన్న తాగునీటికి తిప్పలు తప్పడం లేదని తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now