Theft of property in the house: తాళం పగల కొట్టి ఇంట్లో సొత్తుచోరీ

Robbery at house
Robbery at house

Theft of property in the house: ఆర్మూర్ టౌన్, సెప్టెంబర్ 30 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం మామిడిపల్లిలోని తిరుమల కాలనీలో నివసిస్తున్న మహేష్ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుని తల్లి ఆరోగ్యం బాగో లేకపోవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటికి వేసిన తాళం పగలగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఇంట్లో ఉన్న 4 తులాల బంగారంతో పాటు 1 లక్ష 80వేల రూపాయలు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు.

సంఘటన స్థలానికి ఏఎస్ఐ చిన్నయ్య తో పాటు క్లూస్ టీం సిబ్బంది వచ్చి ఆధారులు సేకరించినట్లు బాధితులు చెప్పారు. కాగా బాధితుడు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని డిటిడిసి కొరియర్ లో ఉద్యోగం చేస్తున్నట్లు వెల్లడించారు. కొరియర్ కు సంబంధించిన 1లక్ష 80వేల రూపాయలు మరుసటి రోజు బ్యాంకు ఖాతాలో వేయాల్సి ఉండగా సొత్తుచూరి కావడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు వారు వాపోయారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now