Business Idea: చాలామంది తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ మంచి అవకాశం మీకోసమే. కేవలం 10 వేలు పెట్టుబడితో ఇంట్లోనే వ్యాపారం చేసుకోవచ్చు. ఆ వ్యాపారం ఏంటో, ఎలా చేసుకోవాలో అలాగే లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు చాలానే ఉన్నాయి. అయితే వ్యాపారం ప్రారంభించిన తర్వాత సేల్స్ చేయడం చాలా ముఖ్యం. ఈ వ్యాపారంలో మంచి ఆదాయం కూడా పొందొచ్చు. కొన్ని రకాల వ్యాపారాలకు ప్రభుత్వ సహకారం కూడా లభిస్తుంది. తక్కువ పెట్టుబడి తో చేసే వ్యాపారాల్లో పచ్చళ్ల వ్యాపారం కూడా ఉంది. ఇంట్లో నుంచే ఈ వ్యాపారాన్ని చేసుకోవచ్చు. కేవలం 10 వేలు పెట్టుబడితో ఇంట్లో నుంచే ఈ వ్యాపారాన్ని చేసుకోవచ్చు.
మెల్లమెల్లగా వ్యాపారం పుంజుకున్న తర్వాత పెట్టుబడిని పెంచుకోవచ్చు. ఇంట్లో నుంచి ఇటువంటి చిరు వ్యాపారాలు చేయాలని అనుకుంటున్నా వాళ్లకి మోడీ సర్కార్ మంచి సహకారం ఇస్తుంది. మొదట మీరు 10 వేలు రూపాయలతో ఇంట్లో నుంచి పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టి ఆ తర్వాత బ్యాంకులు లేదా ప్రభుత్వ రుణ పథకాల సహకారంతో పెట్టుబడి తీసుకొని వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. తర్వాత మీరు ముద్ర లోన్ లేదా ఎంఎస్ఎమ్ఈ రుణాలకు కూడా అప్లై చేసుకోవచ్చు.
అయితే ఈ వ్యాపారం చేయడానికి మంచి పచ్చళ్ళు తయారు చేసే విధానం తెలిసి ఉండాలి. ఈ వ్యాపారం ముడి సరుకు కోసం కేవలం 10 వేలు చాలు. మంచి రుచితో పాటు ప్యాకేజింగ్తో కస్టమర్లను ఆకట్టుకోగలగాలి. ఆన్లైన్లో కూడా వీటిని అమ్ముకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా వీటిని కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఆన్లైన్ తో పాటు రిటైల్ మార్కెట్లు మరియు రిటైల్ చైన్స్ ద్వారా కూడా వీటిని సులభంగా అమ్ముకోవచ్చు. వీటి వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎక్కువ విస్తీర్ణం ఉన్న స్థలం కూడా అవసరం ఉండదు. కేవలం చిన్న స్థలం ఉన్నా కూడా సరిపోతుంది. ఒక చిన్న రూమున్న ఇంట్లో కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.