Zodiac signs: ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి.. నేటి 12 రాశుల రాశి ఫలాలు ఇవే..
నేడు మార్చి 21, 2025 రాశి ఫలాల ప్రకారం మేష రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతు లభిస్తుంది. అలాగే వృషభ రాశి వారికి ఉద్యోగంలో మార్పు మరియు మిథున రాశి వారికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. మేష రాశి నుంచి మీన రాశి వరకు నేడు దిన ఫలాలు ఇలా ఉన్నాయి…
మేషరాశి:
వృత్తి మరియు ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారాలలో లాభాలు నిలకడగా ఉంటాయి. కుటుంబంలో శుభ పరిణామాలు జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయమవుతుంది. ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు కూడా ఇది సరైన సమయం.
వృషభరాశి:
వృత్తి మరియు వ్యాపారాలలో శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో లాభం ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా ఉంటుంది. ఉద్యోగ మారడానికి ఇది సరైన సమయం. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తిచేస్తారు. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది.
మిథున రాశి:
ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. వృత్తి మరియు వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో ఎవరిని నమ్మకూడదు.
కర్కాటక రాశి:
వృత్తి మరియు ఉద్యోగాలు సానుకూలంగా ఉంటాయి. అధికారుల నమ్మకం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. షేర్లు, స్పెక్యులేషన్లు మరియు ఇతర ఆర్థిక లావాదేవీలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది కానీ అనుకొని ఖర్చులు ఉంటాయి. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఆశించిన సమాచారం పొందుతారు.
సింహరాశి:
ఉద్యోగంలో అదనపు బాధ్యతల వలన పని భారం పెరుగుతుంది. వృత్తి మరియు వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ కుటుంబ ఖర్చులు అందుకు సరిపడా ఉంటాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి అనుకున్న సమాచారం అందుతుంది. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
కన్య రాశి:
వృత్తి మరియు వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో సానుకూల మార్పులు ఉంటాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి ఇది సరైన సమయం. అనేక మార్గాలలో ఆదాయం వృద్ధి చెందుతుంది. పెట్టుబడుల వలన లాభాలు పొందుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
తులారాశి:
ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. హోదా పెరుగుతుంది. వృత్తి జీవితం బిజీగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు నిలకడగా ఉంటాయి. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాల విషయంలో శుభవార్తలు వింటారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఇప్పటివరకు పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చిక రాశి:
ఉద్యోగంలో అధికారులతో కొద్దిగా అభిప్రాయ బేధాలు కలిగే అవకాశం ఉంది. ఓర్పు, సహనంతో వ్యవహరించాలి. నిరుద్యోగులకు మంచి అవకాశం అందుతుంది. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన అందుతుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆదాయం కూడా నిలకడగా ఉంటుంది.
ధనస్సు రాశి:
ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకోగలుగుతారు. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒకటి లేదా రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశముంది.
మకర రాశి:
వృత్తి మరియు ఉద్యోగాలు సానుకూలంగా ఉంటాయి. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. సొంత పనుల మీద శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యమైన పనుల కోసం ఇతరుల మీద ఆధార పడొద్దు.
కుంభరాశి:
ఉద్యోగంలో పని భారం ఉంటుంది. మీ మీద అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి జీవితంలో రాబడి పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలు పురోగతి లభిస్తుంది.
మీనరాశి:
ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగుతుంది. వృత్తి జీవితం బిజీగా మారుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇది సరైన సమయం. ఏ పని తలపెట్టినా కూడా విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆదాయం బాగా అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది.