Medak District: చేగుంట, ఏప్రిల్ 4 (ప్రజా శంఖారావం): మెదక్ జిల్లా, చేగుంట పట్టణ కేంద్రంలో రైల్వే స్టేషన్లో రోడ్ లో గల చౌక ధరల దుకాణం వద్ద దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో చిన్నారెడ్డి, ఎమ్మార్వో శ్రీకాంత్ చేతులమీదుగా సన్న బియ్యం కార్యక్రమం ప్రారంభించబడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ శ్రీకాంత్ కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సన్న బియ్యం తెలంగాణ పేద ప్రజలకు అందించే ఉద్దేశంతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ, పేదవాళ్లు అందరూ దీనిని సద్విగం చేసుకోవాలి.
ఈ ప్రభుత్వంలో 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తుంది. గ్యాస్ 500 కే ఇస్తుంది, ఏకకాలంలో దేశ చరిత్రలోనే 21 వేల కోట్ల రుణమాఫీ ఒక సంవత్సరం లోపలోనే చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మహిళా సోదరీమణులకు ఎక్కడికి పోవాలన్న ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన వారి కుటుంబానికి భారం కాకుండా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మొదటి సంవత్సరంలోనే నిరుద్యోగ యువతి యువకులకు దాదాపు 56 వేల ఉద్యోగాలు నియామక పత్రాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ, ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా సమాజంలో సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి వారికి రాజీవ్ యువ వికాస్ పథకం కూడా తీసుకురావడం జరిగింది. దాదాపు 6 లక్షల మందికి నాలుగు లక్షల రుణం వారికి అందించడం, వారు నీలాడొక్కుకోవడానికి, అలాగే సమాజం లో నాకు ఉద్యోగం రాలేదని అసమానత రావద్దని చెప్పి యువతరంకు ఒక గొప్ప అవకాశం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ . ముఖ్యంగా చేగుంట మండల రైతందానికి విజ్ఞప్తి చేస్తూన్న రైతులు వరి పండించే వారికి, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎవరైతే సన్నబియ్యం పండిస్తారో కచ్చితంగా వారికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగిన తర్వాత చెరుకు శ్రీనివాస్ రెడ్డి నాలుగు గ్రామాలు అయినటువంటి ఇబ్రహీంపూర్, రెడ్డిపల్లి, వడియారం, పెద్ద శివునూరు గ్రామాలకు చెందిన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిన్నారెడ్డి, ఎమ్మార్వో శ్రీకాంత్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, చౌక ధరల దుకాణం చిట్టబోయిన శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ కొండి శ్రీనివాస్, పిఎసిఎస్ భాగయ్య, మ్యాకల పరమేష్, వెంగళరావు, భాస్కర్, సండ్రుగు శ్రీకాంత్, సాయి కుమార్ గౌడ్, మోహన్ నాయక్, డీలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ పాల్గొన్నారు.