SSC STUDENTS: పిల్లల తల్లిదండ్రులతో పాటు విద్యార్థులకు చక్కని మార్గదర్శకాలతో పాటు కొన్ని కోర్సులపై వివరాలు తెలియజేయుటకు మా వంతు ప్రయత్నం.. మీ SSC (10వ తరగతి) పూర్తి అయిన పిదప, మీరు మీ ఆసక్తిని బట్టి, ఫ్యూచర్ లక్ష్యాలను బట్టి ఇంజనీరింగ్ (పాలిటెక్నిక్), మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, పారామెడికల్ కోర్సులు, హోటల్ మేనేజ్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ లేదా డేటా ఎంట్రీ & కంప్యూటర్ అప్లికేషన్‌లలో డిప్లొమా కోర్సుల్లో చదవడానికి చక్కటి అవకాశం, భవిష్యత్తు ఉపయోగాలు ఉన్నాయి.
ఇక్కడ కొన్ని జనాదరణ పొందిన, వివిధ కోర్సుల అర్హత ప్రయోజనకరమైన విషయాలపై వివరణ:
డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ (పాలిటెక్నిక్):
మీకు ఎలక్ట్రికల్, మెకానికల్ లేదా సివిల్ ఇంజనీరింగ్ వంటి సాంకేతిక రంగాలపై ఇంట్రెస్ట్ ఉంటే ఇది మంచి ఎంపిక.
కోర్సు టైం: సాధారణంగా 2-3 సంవత్సరాలు.
అర్హత: 10వ తరగతి.
మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (MLT):
ఈ కోర్సు రంగంలో ఆరోగ్యపరమైన విధానాలను నిర్ధారించడానికి మరియు చికిత్స చేయడానికి ప్రయోగశాల పరీక్షలలో పుణ్యం పొందడానికి ఈ కోర్సు సహకరిస్తుంది.
కోర్సు టైం: 2-3 సంవత్సరాలు.
అర్హత: 10వ తరగతి.
పారామెడికల్ కోర్సులు (Medical):
ఈ కోర్సులో డాక్టర్లు, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణులకు హెల్ప్ చేయడానికి (అసిస్టెంట్ వైద్యులుగా ఉదాహరణకు ఆస్పత్రిలో ఉండే అనుభవజ్ఞులైన కాంపౌండర్లు) వ్యక్తులకు శిక్షణ తీసుకోవడంలో ఈ కోర్సు సహకరిస్తుంది.
కోర్సు టైం: మనం తీసుకునే నిర్దిష్ట కోర్సును బట్టి కోర్సు టైం కేటాయించబడుతుంది.
అర్హత: 10వ తరగతి.
హోటల్ మేనేజ్మెంట్ (Hotel Management):
ఈ ఫీల్డ్ హోటళ్లు, రిసార్ట్‌లు, రెస్టారెంట్లతో సహా విహారయాత్రలో విడిది కోరే ఆతిథ్య పరిశ్రమపై అనుభవంతో కూడిన శిక్షణ తీసుకోవడానికి ఈ కోర్సు సహకరిస్తుంది.
కోర్సు టైం: హోటల్ మేనేజ్మెంట్ లో మనం తీసుకునే కోర్సును బట్టి వ్యవధి మారుతుంది.
అర్హత: 10వ తరగతి.
డిజిటల్ మార్కెటింగ్:
ఉత్పత్తులు, డిజిటల్ మార్కెటింగ్ సేవలను ప్రచారం చేయడానికి ఆన్‌లైన్ ఛానెల్‌లతో పాటు డిజిటల్ రంగంలో ఉపయోగపడే అనుభవం ఈ ఫీల్డ్‌లో ఉంటుంది.
కోర్సు టైం: డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో తీసుకునే కోర్సును బట్టి కాలపరిమితి ఉంటుంది.
అర్హత: 10వ తరగతి.
గ్రాఫిక్ డిజైనింగ్ & యానిమేషన్:
ఈ ఫీల్డ్‌లో వివిధ ప్రయోజనాల కోసం డిజిటల్ రంగానికి సంబంధించిన నైపుణ్యతను, ప్రకటనలను సృష్టించడం ఈ కోర్సు దోహదపడుతుంది.
కోర్సు టైం: నిర్దిష్ట కోర్సును బట్టి కోర్సు టైం ఉంటుంది.
అర్హత: 10వ తరగతి.
డేటా ఎంట్రీ & కంప్యూటర్ అప్లికేషన్స్:
ఈ ఫీల్డ్ కంప్యూటర్ల డేటా ఎంట్రీ, సంబంధించిన వివిధ కోర్సుల ఆధారంగా (ఉదాహరణకు డిటిపి ఆపరేటర్, ఏదైనా సంస్థకు సంబంధించి డేటా ఎంట్రీ, ప్రభుత్వ పథకాలకు సంబంధించి డేటా ఎంట్రీ) వంటి డేటాతో పని చేస్తుంది.
కోర్సు టైం: మనం తీసుకుని కోర్సు బట్టి టైం ఉంటుంది.
అర్హత: 10వ తరగతి.
వ్యవసాయం & వ్యవసాయ కోర్సులు:
ఈ కోర్సులు వ్యవసాయం మరియు సంబంధిత రంగాలపై ఈ విధమైనటువంటి నైపుణ్యం మనకు ఉపయోగపడుతుందో దృష్టి కేంద్రీకరించడానికి సహాయపడుతుంది.
కోర్సు టైం: నిర్దిష్ట కోర్సును బట్టి సమయం మారుతుంది.
అర్హత: 10వ తరగతి.
సరైన స్ట్రీమ్‌ను ఎంచుకోవడానికి చిట్కాలు:
మీరు ఎలాంటి రంగంపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు మొదటగా ఒక నిర్ణయానికి వచ్చి మీరు ఏ సబ్జెక్టుల మీద ఆసక్తి కలిగి, ఆ రంగాలను ఎంచుకుంటే మీకు ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ కోర్సు పై నిర్ణయం తీసుకోండి.
మీ ఇంట్రెస్ట్ ని బట్టి ఏ విధంగా భవిష్యత్తులో ఈ కోర్సు తీసుకుంటే భవిష్యత్తు అవకాశం మెరుగుపడుతుందో చూసుకోండి. మీరు ఆసక్తిగా ఉన్న కోర్సు లో శిక్షణ తీసుకుంటే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయో కూడా శోధించి తెలుసుకోండి.
భవిష్యత్తు కెరియర్ కోసం ఏ విధమైన కోర్స్ తీసుకుంటే బాగుంటుందో మీ సబ్జెక్టు ఇంట్రెస్ట్ ను బట్టి కౌన్సిలింగ్ ఇచ్చే నైపుణ్యత గల వ్యక్తులను సంప్రదిస్తే మీకు అవకాశాలు బాగుంటాయని మా సలహా..