POST OFFICE: పోస్ట్ ఆఫీస్ ఇప్పటివరకు ప్రజల కోసం అనేక పథకాలను అమలులోకి తెచ్చింది. తాజాగా పోస్ట్ ఆఫీసర్ ఎంఐఎస్ పథకంలో పెట్టుబడి పెట్టడం వలన నెలకు రూ.5550 వడ్డీని పొందవచ్చు. ఈ పథకానికి ఐదు సంవత్సరాల లాక్ ఇన్ వివది ఉంటుంది. మొత్తంగా మీకు రూ.3,33,000 వడ్డీ అందుతుంది. భారతదేశ సామాన్య ప్రజల కోసం పోస్ట్ ఆఫీస్ ఇప్పటివరకు అనేక పథకాలను అమలు చేసింది. బ్యాంకుల కంటే పోస్ట్ ఆఫీస్ లో ఎక్కువ వడ్డీ కూడా వస్తుంది. ఇటువంటి ఒక అద్భుతమైన పథకాన్ని పోస్ట్ ఆఫీస్ ప్రజల కోసం తీసుకువచ్చింది. ఈ పథకంలో మీరు పెట్టుబడి పెట్టడం వలన ప్రతినెలా డబ్బును సంపాదించుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీకు నెలకు రూ.5550 వడ్డీ లభిస్తుంది.
పోస్ట్ ఆఫీస్ ఎం ఐ ఎస్ పథకం అంటే ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టే పథకం. ఈ పథకంలో మీకు ప్రతి నెల ఒకేసారి మొత్తం మరియు వడ్డీ డబ్బు మీ ఖాతాలో ఉంటుంది. కనీసం వెయ్యి రూపాయల నుంచి పోస్ట్ ఆఫీస్ లో మీరు ఖాతాను తెరవచ్చు. అలాగే ఈ పథకంలో గరిష్టంగా తొమ్మిది లక్షలు డిపాజిట్ చేయవచ్చు. అలాగే ఈ పథకం కింద ఉమ్మడి ఖాతాలో గరిష్టంగా 15 లక్షలు జమ చేయవచ్చు. ఉమ్మడి ఖాతా కిందా గరిష్టంగా ముగ్గురిని జోడించుకోవచ్చు. ఈ పథకం ప్రస్తుతం సంవత్సరానికి 7.4% వడ్డీ రేటును అందిస్తుంది. ఈ నెల వారి ఆదాయ పథకానికి ఐదు సంవత్సరాల లాక్ ఇన్ ఎవది ఉంటుంది. అలాగే మీకు అవసరం ఉన్నప్పుడు ఖాతాను మూసివేసి మొత్తం డబ్బును ఉపసంహరించుకోవచ్చు. అలాగే పోస్ట్ ఆఫీస్ ఎం ఐ ఎస్ పథకం కింద ఖాతా ఓపెన్ చేయడానికి మీకు పోస్ట్ ఆఫీస్ లో పొదుపు ఖాతా కూడా ఉండాలి.