JOBS REQUIREMENT: రోస్టర్ నిబంధనలు పాటించకుండా ఉద్యోగాల నియామకం

JOBS REQUIREMENT
JOBS REQUIREMENT

JOBS REQUIREMENT: కామారెడ్డి, ఏప్రిల్ 4 (ప్రజా శంఖారావం): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా ఇటీవల నియమించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేయడం జరిగిందని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న రోస్టర్ నిబంధనలను పాటించకుండా డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ఉద్యోగాలను ఇచ్చారని,తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి అన్యాయం చేయడం జరిగిందని ఆరోపిస్తూ తెలుగు నాడు విద్యార్థి సమైక్య (టీఎన్ఎస్ఎఫ్),తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు,తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ 50 ఉద్యోగాల కోసం 700 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటే అందులో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని,ఇచ్చిన ఉద్యోగాలు ఏ ప్రాతిపదికన ఇవ్వడం జరిగిందో ఆ వివరాలను ఇప్పటికి కూడా బయట పెట్టడం లేదని,ఏజెన్సీ రద్దు అవుతుందనే ఉద్దేశంతో రెండు రోజుల ముందే నియామకాలు రాత్రికి రాత్రి చేశారని రోస్టర్ నిబంధనలను కూడా పాటించలేదని,నోటిఫికేషన్ లో ఇచ్చిన రోస్టర్ నిబంధనలు ఉద్యోగాలు పొందిన వారి యొక్క రోస్టర్ కు ఏమాత్రం సంబంధం లేదని దీనిపైన జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ అక్రమ నియామకలకు పాల్పడ్డ వారిని ఉపేక్షిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చిన చెడ్డ పేరు కాంగ్రెస్ పార్టీకి కూడా వస్తుందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలనిు ు అన్నారు.తప్పుడు మార్గంలోu ఉద్యోగాలను పొందిన వారిని తొలగించకపోతే హైకోర్టును ఆశ్రయించి అర్హులకు న్యాయం చేసే వరకు పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు నవీన్ సంతోష్ సందీప్ బాలకృష్ణ ప్రభు విష్ణువర్ధన్ నవనీత్ రాహుల్ రంజిత్ సాయి అంజి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now