Gold Rate Today: లక్ష చేరువలో పసిడి ధరలు.. నేడు తెలుగు రాష్ట్రాలలో పసిడి, వెండి ధరలు ఇలా..

Todays Gold Price
Todays Gold Price

Gold Rate Today: లక్ష చేరువలో పసిడి ధరలు.. నేడు తెలుగు రాష్ట్రాలలో పసిడి, వెండి ధరలు ఇలా..

బంగారం పరుగులు పెడుతూ పసిడి ప్రియులకు షాక్ ఇస్తుంది. ఈ మధ్యకాలంలో పసిడి ధరలు ఆల్ టైం హై రికార్డుకి చేరుకున్నాయి. మొదటిసారిగా తులం పసిడి ధర లక్షకు చేరువలో ఉంది. ఇలా పసిడి ధరలు పెరగడానికి ముఖ్య కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెర తీసిన ప్రతీకార సంఘాలు అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. బంగారం దారిలోనే వెండి కూడా పయనిస్తుంది. భారతీయులకు బంగారంతో మంచి సంబంధం ఉంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఇలా సందర్భం ఏదైనా ముందుగా అందరూ బంగారాన్ని కొనుగోలు చేస్తారు. కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా ఆర్థిక భరోసా కోసం కూడా మన దేశ ప్రజలు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు.

గత కొన్ని ఏళ్ల నుంచి పసిడిని ఒక మంచి పెట్టుబడిగా అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో పసిడి ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాల ప్రకారం ఎప్పటికప్పుడు పసిడి ధరలు మారుతూ ఉంటాయి. డాలర్ మారకపు విలువ కూడా మన దేశీయ పుత్తడి ధరలపై ప్రభావాన్ని చూపుతుంది. ఇక పసిడి తర్వాత బాగా డిమాండ్ ఉన్న లోహం వెండి. కాబట్టి వినియోగదారులు ఎప్పటికప్పుడు పసిడి ధరలతో పాటు వెండి ధరలను కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఈరోజు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన ప్రాంతాలలో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము.

పసిడి, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్ నగరంలో ఈరోజు పసిడి ధర స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తుంది. పసిడి ఆల్ టైం హై రికార్డుకు చేరుకుంది. ఈరోజు 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.88,160, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.96,180 గా నమోదయ్యాయి.

ఇతర ప్రధాన నగరాలు అయిన వరంగల్, రాజమండ్రి, పొద్దుటూరు, విజయవాడ మరియు విశాఖపట్నంలో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.88,310, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.96,330 గా ఉన్నాయి. ఈరోజు ముంబైలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.88,160, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.96,180 గా ఉన్నాయి. అలాగే చెన్నై నగరంలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.88,160, 24 క్యారెట్ల తులం పసిడి ధర రు.96,180 గా ఉన్నాయి.

మన దేశంలోనే ఇతర ప్రధాన నగరాలు అయిన కేరళ, కోల్కత్తా మరియు బెంగళూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మన దేశ ప్రజలు బంగారం తర్వాత ఎక్కువగా వెండిని కొనడానికి ఆసక్తి చూపిస్తారు. వెండిని ఆభరణాలుగా మాత్రమే కాకుండా నాణేలు, వంట పాత్రల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అలాగే వెండిని విద్యుత్ పరికరాలలో, అద్దాలు మరియు రసాయిక చర్యలలో ఉత్పరకంగా కూడా ఉపయోగిస్తారు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెండివి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఈరోజు వెండి కూడా స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తుంది. ఈరోజు వెండి రూ.1,10,100 గా ఉంది.

హైదరాబాద్ నగరం తో సహా ఇతర తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రధాన ప్రాంతాలలో కూడా వెండి ధర ఈ విధంగానే ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now