Central Home Minister: చుక్క నీరు కూడా పాక్ కు వెళ్లకుండా అమిత్ షా ప్లాన్.. సంచలన కామెంట్

Central Home Minister
Central Home Minister

Central Home Minister: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గాంలో జరిగిన ఉగ్ర దాడితో ఒక్కసారిగా భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో పాక్ తో జరిగే సింధూ నది జలాల ఒప్పందాన్ని వెంటనే రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా సింధూ నది నుండి ఒక చుక్క నీరు కూడా పాక్ దేశానికి వెళ్లకుండా కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం పక్కాగా ప్లాన్ అమలుచేస్తుంది. నది జిల్లాలపై కేంద్ర హోం శాఖ మంత్రి హమీషా ఢిల్లీలో ముఖ్యమైన సమావేశాన్ని జరిపారు.

జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఉన్నత అధికారులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు సమావేశం అయ్యారు. అప్పట్లో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో జరిగిన సింధూ నది నీటి ఒప్పందాలపై ఆయన వారితో చర్చించారు. సమావేశంలో సింధు నది నీటిని ఎట్టి పరిస్థితిలో కూడా పాక్ కు చేరకుండా 3 దశల్లో పక్క ప్లాన్ వేయాలని సూచించారు. మొదటగా వరల్డ్ బ్యాంకు మన దేశ వైఖరిని తెలుపాలని సూచించారు.

నదుల జలాలపై రెండు దేశాల ఒప్పందాలు:

అప్పటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1960 సెప్టెంబర్ లో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య నీటి పంపిణీకి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. భారత్, పాక్ దేశాల మధ్య నీటి ఒప్పందానికి వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది. ఈ నీటి ఒప్పందం లెక్కల ప్రకారం తూర్పున ఉన్న రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్ కు పూర్తి హక్కులు ఉన్నాయి. అలాగే మరోవైపు సింధు, చీనాబ్, జీలం నదులపై పాకిస్తాన్ కు బాధ్యతను ఇచ్చారు. భారత్ పాక్ దేశాలు విడిపోయినప్పటి నుంచి ఈ వివాదం అలాగే కొనసాగుతుంది. 1948లో పాక్ దేశానికి భారత్ నీటిని నిలిపివేసింది. కానీ మళ్ళీ ఐక్యరాజ్యసమితి జోక్యంతో నీటి జలాలపై మళ్ళీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం సింధూ నదిలో 20% నీరు భారత్ కు, మిగిలిన 80% జలాలు పాకిస్తాన్ కు వినియోగించుకునే వెసులుబాటును కల్పించారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now