Dmart: డిమార్ట్ లో భారీ డిస్కౌంట్లు ఎందుకిస్తారో తెలుసా.. తెలిస్తే షాక్ అవుతారు

Dmart
Dmart

Dmart: దేశ వ్యాప్తంగా డీమార్ట్ చాలా ఫేమస్. రాధా కిషన్ ధమని స్థాపించిన డీమార్ట్ స్టోర్లు దేశవ్యాప్తంగా 400కు పైగా ఉన్నాయి. అయితే డి మార్ట్ లో ప్రతి వస్తువు కూడా డిస్కౌంట్తో లభిస్తుంది. డి మార్ట్ స్టోర్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా డీమార్ట్ లో కొనుగోలు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా డీమార్ట్ లో సరదాగా తిరగడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా అయితే శని, ఆదివారం రోజు డీమార్ట్ లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. మహిళలు అయితే డీమార్ట్ కు వెళ్లడానికి చాలా ఇష్టపడతారు.

డీమార్ట్ లో వాళ్లు ఎన్ని గంటలైనా షాపింగ్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నిత్యవసర వస్తువుల కోసం డి మార్ట్ లో షాపింగ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో డిమార్ట్ స్టోర్లు మెట్రోపాలిటన్ సిటీలలో మాత్రమే కాకుండా టైర్ 2 సిటీలకు కూడా విస్తరించాయి. దేశవ్యాప్తంగా మొత్తము 415 డి మార్ట్ స్టోర్లు ఉన్నాయి. పెద్ద నగరాలతో పాటు చిన్న నగరాలలో కూడా ఈ స్టోర్స్ వ్యాపించాయి. చాలామంది డిమార్ట్ కు వెళ్లడానికి ముఖ్య కారణం ఏంటంటే డిమార్ట్ స్టోర్ లో ప్రతి వస్తువుపై డిస్కౌంట్ లభిస్తుంది.

కానీ డి మార్ట్ స్టోర్ లో ఇంత భారీ డిస్కౌంట్ ఇవ్వడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో చాలామందికి తెలియదు. దీనికి ముఖ్య కారణం డి మార్ట్ స్టోర్ అధిపతి రాధా కిషన్ ధమని అద్దె స్థలంలో డీమార్ట్ స్టోర్ తెరవకపోవడం. దీనివలన అతని బిజినెస్ నిర్వహణ ఖర్చులు చాలా తగ్గుతాయి. సొంత భూములలో ఈ స్టోర్ ఏర్పాటు చేయడంతో అద్దె కట్టాల్సిన అవసరం ఉండదు. తన ఖర్చులలో ఈ స్టోర్ ఐదు నుంచి ఏడు శాతం వరకు ఆదా చేస్తుంది. ఆ మిగిలిన మొత్తాన్ని డిస్కౌంట్ రూపంలో ఈ స్టోర్లో ప్రజలకు అందిస్తుంది. తన స్టాక్ ను డి మార్ట్ స్టోర్ పూర్తి చేయడం కూడా మరొక కారణం. డీమార్ట్ ముఖ్య లక్ష్యం 30 రోజులలో ఉన్న సరుకులు మొత్తాన్ని పూర్తిచేసి కొత్త వస్తువులను ఆర్డర్ చేయడం.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now