ChatGPT: ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు ఏఐ చాట్ జిపిటిని ఉపయోగించుకుంటున్నారు. రీసెంట్ గా అమెరికాకు చెందిన ఒక మహిళ రియల్టర్ గా కేవలం 30 రోజులు ఎలా తనకున్న పది లక్షల అప్పును తీర్చుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. 35 ఏళ్ల జెన్నిఫర్ ఆలెన్ డేలా వేర్కు చెందింది. ఆమె ఒక రియల్టర్. సోషల్ మీడియాలో ఆమె కంటెంట్ క్రియేటర్ గా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఆమెకు సంపాదన ఉన్నప్పటికీ సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో రీసెంట్గా తల్లి అయిన ఆమె అనేక కారణాల వలన ఆర్థిక సమస్యలలో ఇరుక్కుపోయింది.
అయితే తనకు సంపాదన ఉన్నప్పటికీ తన ఆర్థిక క్రమశిక్షణ సరిగ్గా లేదని, తనకు ఎవరు నేర్పించలేదని ఇటీవలే ఆమె చెప్పుకొచ్చింది. రీసెంట్గా జెనీఫర్ ఒక బిడ్డకు తల్లి అయింది. ఇక అప్పటినుంచి ఆమె బిడ్డ వైద్య ఖర్చులకు అలాగే ఇతర ఖర్చులకోసం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. క్రెడిట్ కార్డు పై ఆధారపడింది. తీసుకున్న డబ్బులు దుబార ఖర్చు చేయలేదని. ఆ డబ్బులతో చాలా రోజులు జీవించే వాళ్ళమని. కానీ ఆ డబ్బులు అమాంతం కొండలాగా పెరిగిపోయాయని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో చూస్తుండగానే ఆర్థిక సమస్యలు పెరిగిపోవడంతో ఆమె చాట్ జిపిటిని ఆశ్రయించింది. తనకు వచ్చే సంపాదన, లాభం, అప్పులు అన్ని విషయాలను కూడా చాట్ జిపిటి లో తెలిపింది.
ఈ మొత్తం వివరాలను పరిశీలించిన తర్వాత చాట్ జిపిటి డబ్బును ఆదా చేయడం కోసం ఒక నెల రోజుల ప్రణాళికను జెన్నీఫర్ కు డిజైన్ చేసి ఇచ్చింది. చాట్ జిపిటి సూచనలను బాగా ఫాలో అయ్యేది. ఈ విధంగా ఒక నెల రోజుల ప్రణాళికను తూచా తప్పకుండా ఫాలో అయిన జెనీఫర్ డబ్బులు ఆదా చేసి కేవలం నెల రోజులలో తనకున్న అప్పులలో సగం అప్పు అంటే రూ.10 లక్షల వరకు తీర్చేసింది.