Nizamabad: నిజామాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 3 ( ప్రజా శంఖారావం ): నగరపాలక సంస్థ కార్యాలయం పై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు జరిపారు. ఎసిబి డిఎస్పి చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస చారి రిటైర్డ్ జవాన్ నుండి 7000 రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుపడ్డారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now