ACB Rides: కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జులై 16 (ప్రజా శంఖారావం): ఆర్టిఏ చెక్ పోస్ట్ లపై వస్తున్న ఫిర్యాదుల మేరకు ఏసీబీ (ACB) అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆర్టిఏ చెక్ పోస్ట్ (RTA CHEK POST) ల వద్ద ప్రైవేట్ వ్యక్తులతో కొంతమంది అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
Also Read: ఏసీబీ వలలో ఉప రాష్ట్ర పన్నుల అధికారి
ఈ నేపథ్యంలో కామారెడ్డి (KAMAREDDY) జిల్లా పొందుర్తి చెక్ పోస్ట్ వద్ద బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లుగా సమాచారం. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద అధికారులు వసూళ్లకు (Coruptionపాల్పడుతున్నారన్న ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: ఏసీబీ అదుపులో పోలీసు శాఖ డీఎస్పీ, టౌన్ ఇన్స్పెక్టర్