ACB: ఏసీబీ అదుపులో పోలీసు శాఖ డీఎస్పీ, టౌన్ ఇన్స్పెక్టర్

ACB RIDES
ACB RIDES

ACB: ఏసీబీ అదుపులో పోలీసు శాఖ డీఎస్పీ, టౌన్ ఇన్స్పెక్టర్

నల్లగొండ జిల్లా, మే 12 (ప్రజా శంఖారావం): ఏసీబీ వలలో పోలీస్ శాఖకు చెందిన ఉన్నత స్థాయి అధికారితో పాటు టౌన్ ఇన్స్పెక్టర్ చిక్కడం ఆ జిల్లాలో సంచలనం కలిగించింది. సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ కె. పార్థ సారథి, టౌన్ ఇన్స్పెక్టర్ వీర రాఘవులును నల్గొండ ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా సూర్యాపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లోని క్రైమ్ నెంబర్ 166/2025 లోని ఫిర్యాదు దారున్ని అరెస్ట్ చేయకుండా ఉండడానికి సదరు బాధితుని వద్ద ₹ 25 లక్షలు లంచం డిమాండ్ చేశారు.

దీంతో బాధితుడు ఆ పోలీసు అధికారులతో బేరం కుదుర్చుకుని ₹ 16 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఉన్న విషయం చెప్పడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. సూర్యాపేట II టౌన్ పోలీస్ స్టేషన్ యొక్క లో ఫిర్యాదుదారుడిని అరెస్టు చేయకుండా ఉండటానికి, ఫిర్యాదుదారుడు తన స్కానింగ్ సెంటర్‌ను సజావుగా నడపడానికి ఈ ఒప్పందం జరిగినట్లు ఏసిబి పిఆర్ఓ అధికారులు లేఖను విడుదల చేశారు. హైదరాబాదులోని నాంపల్లి ఏసిబీ కోర్టులో డిఎస్పి, ఇన్స్పెక్టర్లను హాజరు పరుస్తామని అధికారులు లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now