ACB Rides: నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చి 12 (ప్రజా శంఖారావం): అవినీతికి అడ్డాలుగా మారయనే ఆరోపణల నేపథ్యంలో రవాణా కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా రవాణాశాఖ ఆఫీస్ లో మధ్యవర్తుల జోక్యం పెరిగిందని, ప్రజలకు ఆర్టీఓ సేవలు డైరెక్ట్ గా అందడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్సులు, కార్డుల రెన్యువల్స్, వాహనాల ఫిట్ నెస్ మొదలైన అవసరాల నిమిత్తం వచ్చే వారిని ఆఫీస్ సమయంలో లోనికి అనుమతించడం లేదని, అంతా మధ్యవర్తులే జోక్యం చేసుకొని పనులు చేస్తున్నారని ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now