Fire Accident: ఆర్మూర్, మార్చ్12 (ప్రజా శంఖారావం): జాతీయ రహదారి 43ను ఆనుకొని ఉన్న 5 వ్యాపార సముదాయ మడిగేలు విద్యుత్ ఘాతంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 25 లక్షల రూపాయల మేరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ శివారులోని జాతీయ రహదారి భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన గల 5 వ్యాపార సముదాయాల్లో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు బాధితులు చెప్పారు. ఈ ప్రమాదంతో ఒకటి కిరాణా షాప్, టీ టిఫిన్ సెంటర్, ఆటో మొబైల్ లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. విద్యుత్ ప్రమాదం సంభవించిన విషయం తెలుసుకున్న ఎస్డిఆర్ఎఫ్, అగ్ని అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now