ACB TRAP: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని మాధాపూర్ ప్రాంతపు ఉప రాష్ట్ర పన్నుల అధికారి ఎం.సుధ ₹8 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ACB Officers) అధికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. ఒక కంపెనీకి చెందిన జిఎస్టి రిజిస్ట్రేషన్ (GST Registration) చేసి నంబరు ప్రక్రియ పని పూర్తి చేయడానికి ఆమె లంచం (A Bribe) డిమాండ్ చేసినట్లుగా తెలిపారు.
Also Read: జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
బాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు డిప్యూటీ స్టేట్ టాక్స్ అధికారిని (Deputy Tax Officer)పై నిఘా పెట్టి బాధితుని నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు (Arrest) చేశామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచాలు అడిగితే ఏసీబీ అధికారులను సంప్రదించాలని ఈ సందర్భంగా వారు కోరారు.
Also Read: ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
టోల్ ఫ్రీ (TollFree) నెంబర్ 1064 లేదా వాట్సాప్ నెంబర్ 9440446106కు సమాచారం ఇచ్చినట్లయితే లంచం డిమాండ్ చేస్తున్న అధికారుల పై దాడులు నిర్వహిస్తామని వారు వెల్లడించారు. ఏసీబీ అధికారులను సంప్రదించిన బాధితుల వివరాలను గోప్యంగా (Confidentially) ఉంచుతామని వారు చెప్పారు.