Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో చీపురును ఇలా పెడితే.. లక్ష్మీదేవికి కోపం వస్తుంది

Vastu Tips
Vastu Tips

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చీపూరి శ్రద్ధగా ఉంచాలి. ఇంట్లో చీపురుని నిలబెట్టడం లేదా నిర్లక్ష్యంగా విసిరేయడం వంటివి చేయడం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశము ఆగిపోతుంది అంటూ వాస్తు శాస్త్రాన్నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో పాత చిగురిని తొలగించే ముందు కొత్త చీపురుని పెట్టాలి. ప్రతిరోజు ఇంట్లో మనం ఉపయోగించే సాధారణ వస్తువులలో చీపురు కూడా చాలా ముఖ్యమైనది. పాస్తు శాస్త్రం ప్రకారం దీనిని కేవలం ఇంటిని శుభ్రం చేయడానికి మాత్రమే కాదు చీపురుకి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. ఇంట్లో చీపురును లక్ష్మీదేవి ప్రవేశానికి సూచనగా భావిస్తారు. అయితే ఇంట్లో చీపురుని పెట్టుకోవడంలో కూడా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటించాలి.

ఈ విధంగా నియమాలు పాటిస్తే ఆ ఇంట్లో సంపద నిలబడుతుంది అని చాలామంది నమ్మకం. చీపురు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కొంతమంది తమ ఇంట్లో చీపురుని నిలబెట్టి ఉంచుతారు. కానీ ఇలా చీపురుని నిలబెట్టడం శుభప్రదం కాదు అని నిపుణులు చెప్తున్నారు. ఈ విధంగా ఇంట్లో చీపురుని నిలబెట్టి ఉంచడం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశం ఆగిపోతుందని చెప్తున్నారు. ఇంట్లో చీపురుని ఉపయోగించిన తర్వాత నిర్లక్ష్యంగా దానిని విసిరేయడం కూడా చాలా పెద్ద పొరపాటు అని చెప్తున్నారు.

దానిని తలకిందులుగా పెట్టకూడదు. ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవికి అవమానంగా పరిగణిస్తారు. కింద పడిపోయిన చీపురుని ఎవరిదైనా కాలు తగిలితే వాళ్ళు నమస్కరించిన పెట్టాలి అని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇంట్లో చీపురుని బట్టి లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందట. ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురుని నిలబెట్టకూడదు. ఉపయోగించిన తర్వాత చీపురుని కింద లేదా వేలాడదీయడం వంటివి చేయాలి. మీరు కొత్త చీపురుని ఇంట్లోకి తెచ్చుకున్నప్పుడు పాత చీపురుని పడేసేముందు దాని చివరి భాగాన్ని కొత్త చీపురులో పెట్టాలి. ఈ విధంగా చేయడం వలన సంపద క్షీణించదు అని నిపుణులు చెప్తున్నారు. దీనిని ఎవరు చూడని ప్రదేశంలో గుడ్డతో కప్పి ఉంచడం వలన చాలా శుభప్రదం అని నిపుణులు చెప్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now