Vastu Tips: ప్రతిరోజు కూడా మనం నిద్ర లేచిన తర్వాత ఆరోజు మొత్తం బాగుండాలి అని కోరుకుంటూ ఉంటాము. కాబట్టి రోజున కొన్ని మంచి విషయాలతో ప్రారంభిస్తే ఆరోజు బాగుంటుంది అని పెద్దలు చెప్తున్నారు.ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే కొన్ని మంచి వస్తువులను చూడాలని అలా కాకుండా నిద్ర లేచిన తర్వాత కొన్ని అశుభకర దృశ్యాలను చూడడం వలన ఆ రోజంతా కూడా చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది అని జ్యోతిష్యులు చెప్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే కొన్ని వస్తువులను చూడకూడదు. వీటిని చూడడం వలన ఆ రోజంతా కూడా చాలా అశుభ్రంగా ఉంటుంది.
మన పురాతన సంప్రదాయాలకు అలాగే శాస్త్రీయ నమ్మకాలకు మన దేశంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇందులో ఉదయం నిద్ర లేచిన వెంటనే రోజున ప్రారంభించే విధానం కూడా చెప్పబడింది. నిద్రలేచిన వెంటనే అనుకోకుండా కొన్ని విషయాలు లేదా కొన్ని దృశ్యాలు కనిపిస్తే ఆరోజు చాలా అశుభ్రంగా ఉంటుంది అని చాలామంది నమ్మకం. ముఖ్యంగా వీటి గురించి జ్యోతిష్య శాస్త్రం అలాగే వాస్తు శాస్త్రంలో కూడా ప్రస్తావించారు. చెల్లాచెదురుగా ఉన్న వస్తువులను లేదా పగిలిన గాజును ఉదయం నిద్ర లేచిన వెంటనే చూడకూడదు.
ఉదయం నిద్ర లేచిన తర్వాత గజిబిజిగా ఉన్న వస్తువులను చూడడం వలన ఆ రోజంతా కూడా పనులలో ప్రతికూలత ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజు ఇంటిని ఉదయం సమయంలో క్రమబద్ధంగా ఉండేలాగా చూసుకోవాలి. చెత్త డబ్బాను కానీ లేదా ఖాళీ పాత్రను కానీ ఉదయం నిద్ర లేచిన వెంటనే చూడకూడదు. ఇలా చూడడం అశుభం. తరచుగా మీకు ఖాళీ పాత్రలు కనిపించడం అంటే అది పేదరికం సూచిస్తుంది. అలాగే చెత్తకుప్పని చూడడం ప్రతికూల శక్తిని ప్రతిబింబిస్తుంది అని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మీరు నిద్ర లేవడానికి ముందు చూసే భయానికమైన లేదా కలవర పెట్టే కలలు కూడా ఆ రోజంతా మీ మనసు పై ప్రభావం చూపిస్తాయి.