Vastu Tips: ఒక వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి మాత్రమే ఉంటే సరిపోదు. ఆ వ్యాపారాన్ని సరైన దిశలో అలాగే సానుకూల శక్తి కూడా కలిగేలాగా ప్రారంభించాలి. వ్యాపారాన్ని సరైన దిశలో ప్రారంభించడంలో వాస్తు శాస్త్రం ముఖ్యపాత్ర పోషిస్తుంది. వాస్తు శాస్త్రం పిసలు అలాగే నిర్మాణం శక్తి ప్రవాహం ఆధారంగా వ్యాపారాన్ని ప్రారంభించడం వలన ఆ వ్యాపారంలో విజయం సాధించవచ్చు. చిన్నచిన్న దుకాణాల దగ్గర నుంచి పెద్దపెద్ద కంపెనీల వరకు కూడా వాస్తు శాస్త్రాన్ని అనుసరించి ప్రారంభించడం సర్వసాధారణం. ప్రతి దిశకు కూడా వాక్య శాస్త్రం ప్రకారం ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది అనే సంగతి అందరికీ తెలిసిందే.
ఉదాహరణకు చెప్పాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశ సానుకూలతకు, ఉత్తర దిశ సంపదను సూచిస్తాయని చెప్తారు. అలాగే వ్యాపారం ప్రారంభించేటప్పుడు ప్రవేశద్వారం, క్యాష్ కౌంటర్ అలాగే ఆ వ్యాపారం ఏర్పాటు అన్ని దిశలు కూడా అనుగుణంగా నిర్మిస్తే అప్పుడు ఆ వ్యాపారంలో శక్తి ప్రవాహం సాఫీగా జరిగి వ్యాపారంలో వృద్ధి జరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఆ వ్యాపార యజమాని లేదా ఉద్యోగులు కూర్చునే స్థలం కూడా సరైనదిగా ఉండాలి.
Also Read: నిద్ర లేవగానే ఈ వస్తువులను చూశారా.. ఇక ఆ రోజంతా అంతే.. అవేంటో తెలుసుకోండ
వ్యాపార యజమాని దక్షిణ లేదా పశ్చిమ దిశలో కూర్చుని తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ముఖం చూడడం వలన ఆ వ్యాపారంలో న్యాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. అలాగే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కూడా సరైన వెలుతురు మరియు శుభ్రమైన వాతావరణం ఉండడం వలన వాళ్ళు చేసే పనితనంలో ఉత్సాహం కలుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం వ్యాపారం లో ఉత్తర దిశలో క్యాష్ కౌంటర్ పెట్టడం వలన ఆ వ్యాపారంలో సంపద ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారంలో స్థిరత్వం పొందాలంటే ఆ వ్యాపారం స్టాక్ లేదా వస్తువులను దక్షిణ పశ్చిమ దిశలో పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వలన ఆర్థికంగా నష్టాలు తగ్గుతాయి.