Chanakya: ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రంలో వ్యక్తిగత పరిశుభ్రత గురించి కూడా కొన్ని నియమాల గురించి తెలిపారు. ఈ నీతి శాస్త్రంలో చాణిక్యుడు మగవాళ్లు దహన సంస్కారాలు, క్షవరం, బాడీ మసాజ్ తర్వాత తప్పకుండా స్నానం చేయాలని తెలిపారు. ఈ విధంగా చేయడం ఆరోగ్యానికి మరియు సమాజానికి కూడా మేలు చేస్తాయని తెలిపారు. ఇప్పటికీ కూడా చాలామంది నీతి శాస్త్రంలో మగద సామ్రాజ్యానికి చెందిన చానిక్యుడు చెప్పిన కొన్ని నియమాలను ఫాలో అవుతుంటారు. నిత్యం మనిషి జీవితానికి సంబంధించిన చాలా విషయాల గురించి చానిక్ ఇప్పుడు నీతి శాస్త్రంలో తెలిపాడు. అలాగే మరి కొన్ని విషయాలలో కొన్ని నిబంధనలు తప్పకుండా పాటించాలి అని చెప్పారు.
ఒకవేళ ఈ నియమాలను ఉల్లంఘించినట్లయితే తమ వ్యక్తిగత జీవితంతో పాటు తమ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. తమ కుటుంబం ఆనందంగా ఉండాలని భావిస్తున్న వాళ్లు కొన్ని నియమాలను తప్పకుండా పాటించడం వలన సమాజానికి కూడా చాలా మేలు చేసినట్లు అవుతుందని ఆచార్య చాణిక్యుడు తెలిపారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడానికి కేవలం డబ్బు, ఆహారం మాత్రమే కాకుండా వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం అని చాణిక్యుడు తెలిపారు. ఒక వ్యక్తి పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉండడం వలన అతను మాత్రమే కాదు అతని చుట్టూ ఉన్న వారందరూ కూడా స్వచ్ఛంగా ఉంటారని చాణిక్యుడు తెలిపాడు.
మనిషి తమ వ్యక్తిగత పరిశుభ్రతలో తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. ఈ మూడు పనులు చేసిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలని చాణుక్యుడు సూచించారు. మగవారు దహన సంస్కారాలకు వెళ్లి వచ్చిన తర్వాత కచ్చితంగా స్నానం చేయాలి. ఇటువంటి సమయంలో శరీరం అపవిత్రం అవుతుంది. ఎన్నో రకాల క్రిమి కీటకాలు మృతదేహం వద్ద ఉండే అవకాశం ఉంది. ఇవి వాళ్ల శరీరంలోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే ఇంటికి వెళ్లిన వెంటనే స్నానం చేసి ఇంట్లోకి ప్రవేశించాలి. మగవారు క్షవరం చేసుకున్న తర్వాత కూడా తప్పకుండా స్నానం ఆచరించాలి. అలాగే బాడీ మసాజ్ లేదా ఆయిల్ మసాజ్ చేయించుకున్న తర్వాత కూడా మగవారు వెంటనే స్నానం చేయాలి.