Post Office Savings Schemes: ఇటీవలే కొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లు తగ్గించాయి. గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండుసార్లు రేపో రేటును తగ్గించిన తర్వాత కొన్ని బ్యాంకులు తమ బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. బ్యాంకులు ఈ విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను తగ్గించడంతో సీనియర్ సిటిజెన్లతో పాటు ఎటువంటి రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలని భావిస్తున్న వాళ్లు కూడా నష్టపోతారు. పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తున్న వారు ఎక్కువ వడ్డీ వచ్చే పథకాలలో తమ డబ్బును పెట్టాలని అనుకుంటున్నారు. అటువంటి వారికి పోస్ట్ ఆఫీస్ లో కొన్ని బెస్ట్ పథకాలు ఉన్నాయి. ఈ పథకాలలో మీకు 8.2% అధిక వడ్డీ లభిస్తుంది.
అంటే ఇది బ్యాంకులలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న బెస్ట్ పథకాలలో సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా ఒకటి. ఈ పథకంలో మీరు కనీసం 250 రూపాయల నుంచి గరిష్టంగా 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీ కూతురు పేరు మీద మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలి. పోస్ట్ ఆఫీస్ ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన పథకానికి 8.20% వడ్డీ అందిస్తుంది. అలాగే సెక్షన్ 80c కింద ఈ పథకంలో మీకు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.
పోస్ట్ ఆఫీస్ లో సీనియర్ సిటిజెన్ల కోసం ఉన్న మరో బెస్ట్ పథకం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఇందులో మీరు కనిష్టంగా ₹1000 నుంచి గరిష్టంగా 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకానికి కూడా పోస్ట్ ఆఫీస్ 8.20% వడ్డీని మీకు అందిస్తుంది. దీని కాల పరిమితి ఐదు సంవత్సరాలు. ఇక ఈ పథకానికి కనీస వయస్సు 60 సంవత్సరాలు ఉండాలి. అలాగే పోస్ట్ ఆఫీస్ లో ఉన్న మరొక గొప్ప పథకం పబ్లిక్ ప్రాఫిడెంట్ ఫండ్. ఇందులో మీరు కనీసం గా 500 రూపాయల నుంచి గరిష్టంగా 1.5 లక్షల వరకు పెట్టుబడి చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఈ పథకంపై మీకు 7.10% వడ్డీ రేటు అందిస్తుంది. దీన్ని పెట్టుబడి కాలపరిమితి 15 సంవత్సరాలు.