Alumni Friends: రాయికల్, జూలై 14 (ప్రజా శంఖారావం): ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం అంతా ఒకే బడిలో.. ఒకే తరగతిలో చదువుకున్న విద్యార్థులు ..పెళ్లిళ్లు, ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతల్లో ఎవరికి వారు ఇన్నాళ్లు కాలం గడిపారు. ఒక్కసారి ఆనాడు చదువుకున్న బాల్య స్నేహితులందర్నీ కలవాలన్నా .. (Alumni Friends) పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి నాంది పలికారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం బాలుర పాఠశాలలో 1996 -1997 పదవ తరగతి చదివిన (Old Students) పూర్వ విద్యార్థులందరూ మండలంలోని మూట పెళ్లి గ్రామంలో ఒకే వేదికపై అపూర్వ సమ్మేళనం ఏర్పాటు (Arrange Program) చేశారు. పాఠశాల దశలో చేసిన అల్లరి పనులు, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు, ఎవరెవరు ఎక్కడ స్థిరపడ్డారన్న విషయాలు, ఇలా ఎన్నో అంశాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు ఎంతో సంతోషంగా ఒకరినొకరి ఆప్యాయతలు పంచుకున్నారు.
Also Read: సీనియర్లకు జూనియర్ విద్యార్థుల వీడ్కోలు
ఈ సమ్మేళనానికి దుబాయ్, ముంబై, హైదరాబాద్ కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి పరిసర ప్రాంతాల నుండి విద్యార్థులు అంతా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గుర్రం రత్నాకర్, చౌటుపల్లి మహేష్, మచ్చ శేఖర్, మండ రమేష్, రాచర్ల ఆంజనేయులు, చిలివేరి సురేష్, కడార్ల శ్రీనివాస్, సాంబారు శ్రీనివాస్, దేవరాజాం, పడాల రమేష్, సింగిడి రమేష్, బెజ్జంకి హరికృష్ణ, నరేందర్, జగన్, పోచయ్య, తిరుపతి రెడ్డి, దొంతి మధు, బైరి శ్రీనివాస్, పూరెల్లి శ్రీనివాస్, యాచమనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Also Read: అమెరికాకు వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్.. హెచ్1బి వీసా తో పనిలేదు.. ఇలా కూడా వెళ్లొచ్చు