Ration Card: వెంటనే వాళ్ళ రేషన్ కార్డులను రద్దు చేయండి..ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

Ration Card
Ration Card

Ration Card: తాజాగా సుప్రీంకోర్టు పేదలకు న్యాయం పేరుతో చాలా రాష్ట్రాలలో రేషన్ కార్డులను అనరులకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అనర్హుల దగ్గర ఉన్న రేషన్ కార్డులను రద్దు చేయాలని తీర్పునిచ్చింది. మరోపక్క ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఉచితల పేరుతో ఒక్కో రాష్ట్రంలో ఒక్క పథకంతో పేదలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో ఉచితలపై దేశవ్యాప్తంగా మళ్లీ చర్చ మొదలైంది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధాన్కడ్ సంక్షేమ పథకాలు మరియు పెన్షన్ల విషయంలో దేశమంతా ఒకే విధానం ఉండాలని తెలిపారు. ఈ క్రమంలో పార్లమెంటులో ప్రభుత్వం మరియు విపక్షాల మధ్య చర్చ జరగాలని ఆయన సూచించారు. రైతులకు నేరుగా సబ్సిడీలు అందిస్తే మేలు జరుగుతుందని తెలిపారు.

సంక్షేమ పథకాలు మరియు సబ్సిడీలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో తీరుగా ఉండడంతో పేదలకు అన్యాయం జరుగుతుందని ఆయన తెలియజేశారు. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరగాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సబ్సిడీలు రైతులకు నేరుగా అందుతున్నాయని ఆయన తెలియజేశారు. మరోవైపు సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా రేషన్ కార్డుల దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం తెలిపింది. రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని చాలా రాష్ట్రాలు పట్టించుకోవడంలేదని తెలిపింది. ధనికులు పేదల ఫలాలు అనుభవిస్తున్నారని అలాగే అనర్హుల రేషన్ కార్డులను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది.

తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పే రాష్ట్రాలు కూడా బిపిఎల్ కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. చాలా రాష్ట్రాలు పేదలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకునేందుకే రేషన్ కార్డుల లెక్కలను చెబుతున్నారని వాస్తవానికి మాత్రం పేదలకు రేషన్ ప్రయోజనాలు అందడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అనర్హులైన వాళ్లే ఎక్కువగా బిపిఎల్ ప్రయోజనాలను పొందుతున్నారని అలాగే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పేదల రేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now