Online UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, భారత్ పే వాడుతున్నారా..! ఈ జాబితాలో మీ నెంబర్ ఉందా..!

Online UPI
Online UPI

Online UPI: బ్యాంకు సర్వీసెస్ మరియు టెలికాం సెంటర్ల ఆపరేటర్లు కలిసి తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయాన్ని వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు చేయబోతున్నారు. దేశంలోని అన్ని విభాగాలలో వినియోగదారులకు ఇది ఒక హెచ్చరిక. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, భారత్ పే వంటి ఆన్లైన్ ఆప్ వాడుతూ ఉన్నవారికి సంయుక్తంగా టెలికాం సెంటర్లు, బ్యాంకుల నుండి హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం మీరు వాడుతున్న యూపీఐ నంబర్ ఈ జాబితాలో ఉంటే వచ్చేనెల 1వ తేదీ నుండి మీరు ఎలాంటి ఆన్లైన్ లావాదేవీలు జరిపించడానికి అనర్హులుగా ప్రకటించబడతారు. ఆ జాబితాలో ఉన్న ఫోన్ నెంబర్లకు బ్యాంక్ అకౌంట్ నుంచే కాకుండా యూపీఐ లావాదేవీల నుంచి తొలగించనున్నారు. నిబంధన వచ్చేనెల 1వ తారీకు నుంచి అమలు కాబోతుంది. ప్రస్తుతం మీరు వాడుతున్న యుపిఐ ఎకౌంటుకు ఏదో ఒక నెంబర్ లింక్ చేసి ఉంటారు. అలాంటి ఫోన్ నెంబర్ ను మీరు చాలా రోజులుగా వాడకుండా హోల్డ్ చేసి ఉంచినట్లయితే అటువంటి ఫోన్ నెంబర్లలో ఇకనుంచి యూపీఐ ఆప్ పనిచేయదు. ఈ విషయాన్ని (ఎన్ పి సి ఐ) నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయని, ఎన్ పి సి ఐ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. వాడుకలోని ఫోన్ నెంబర్లతో బ్యాంకింగ్ రంగంతోపాటు యూపీఐ వ్యవస్థలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని ఎన్ పీ సీ ఐ ఈ నిర్ణయానికి వచ్చింది. వాడుకలో లేని టెలికాం సెంటర్ల నంబర్లను మరొకరికి కేటాయించినప్పుడు తప్పిదాలు జరిగే ఆస్కారం ఉందని, అటువంటి ఘటన నుంచి జాగ్రత్త పడటానికి ఎన్ పి సి ఐ ఈ నిర్ణయానికి వచ్చింది. మీ ఆన్లైన్ లావాదేవీలు సక్రమంగా జరగాలంటే వాడుకలో ఉన్న ఫోన్ నెంబర్లను మాత్రమే బ్యాంక్ మరియు యూపీఐ లకు లింక్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ వాడుకలో లేని ఫోన్ నెంబర్లకు యూపీఐ లింక్ చేసి ఉన్నట్లయితే అలాంటి వారికి ఈ హెచ్చరిక వర్తిస్తుంది.

మీ బ్యాంకు లోని ఎకౌంటుకు అనుసంధానం చేసిన ఫోన్ నెంబర్ వర్కింగ్ లో ఉందో లేదో తెలుసుకోవాలంటే మీ టెలికాం సంస్థతో మీ ఫోన్ నెంబర్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ నంబర్ వర్కింగ్ లో లేకపోతే వెంటనే తిరిగి నంబర్ ను మనగడ (వాడుక)లోకి తీసుకొచ్చుకోవాలి లేదా మరో కొత్త నెంబర్ తో బ్యాంకు లింకు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ఎన్ పి సీ ఐ ఇప్పటినుండి ప్రతివారం వాడుకలో లేని ఫోన్ నెంబర్లను రికార్డుల నుండి తొలగిస్తూ, సరి చేసుకోవాలని సంబంధిత బ్యాంకులకు యూపీఐ ఖాతాదారులకు ఆదేశించింది. వచ్చే నెల ఒకటి నుంచి వాడుకలో లేని ఫోన్ నెంబర్లను బ్యాంకు లింకుల నుండి తొలగించనున్నారు. మీరు వాడుకల్లో లేని ఫోన్ నెంబర్ల జాబితాలో ఉంటే వెంటనే సంబంధిత టెలికాం సెంటర్ల నంబర్లను యాక్టివ్ చేసుకొని బ్యాంకులతో ఖాతా యొక్క లింక్ సరి చేసుకోండి లేకపోతే వచ్చే నెల ఒకటో తారీకు నుండి అలాంటి టెలికాం సెంటర్ల నంబర్లను యూపీఐ లింకుల నుండి పూర్తిగా తొలగించబడుతాయని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పి సీ ఐ) హెచ్చరిక జారీ చేస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now