Yamadonga Movie: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ దేవర సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకున్నారు. అయితే ఇప్పుడు వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. మరోపక్క ఎన్టీఆర్ దేవర సీక్వెల్లో కూడా నటిస్తున్నారు. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాలలో యమదొంగ సినిమా కూడా ఒకటి. సోషియో ఫాంటసీ కథతో దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ విజయం అందుకుంది.
అయితే రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఈ సినిమాకు ముందు వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక యమదొంగ సినిమా తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ సినిమాలో కూడా నటించారు. ఇక ఈ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాను ఎన్టీఆర్కు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డు కూడా వచ్చింది. ఇక యమదొంగ సినిమాలో ఎన్టీఆర్కు జోడిగా ప్రియమణి, మమతా మోహన్దాస్ హీరోయిన్లుగా నటించారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పలువురు చిన్నారులు ఈ సినిమాలో తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహ కూడా ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా తన నటనతో మెప్పించాడు. హీరో చిన్ననాటి పాత్రలో శ్రీ సింహ నటించాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ చిన్ననాటి పాత్రలో నటించింది బిగ్ బాస్ 8 ఫేమ్ విష్ణు ప్రియ అని చాలామంది అంటున్నారు. విష్ణు ప్రియ తెలుగులో కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది. ఇక యమదొంగ సినిమాలో కూడా హీరోయిన్ చిన్ననాటి పాత్రలో కనిపించింది విష్ణు ప్రియ నే అని చాలామంది అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అని తెలుస్తుంది.
View this post on Instagram