Cricket Kings: ప్రపంచ క్రికెట్ లో సిక్సుల రారాజు ఎవరో తెలుసా.. ?

Cricketer Gale
Cricketer Gale

Cricket Kings: ప్రపంచ క్రికెట్ లో సిక్సుల రారాజు ఎవరో తెలుసా.. ?

టీ 20 మ్యాచులు అనగానే సిక్సులు, ఫోర్లు బాదడం.. ఎంటర్ టైన్ మెంట్ చేయడంతో పాటు దూకుడైన ఆటతీరుకు పెట్టింది పేరు. 2008 నుంచి ప్రారంభమైన ఐపీఎల్ లో కూడా సిక్సుల మోత మోగుతూనే ఉంది. ఇప్పటి వరకు చాలా మంది క్రికెటర్లు ఐపీఎల్ మ్యాచుల్లో సిక్సులు కొట్టి తన సత్తా చాటుకున్నారు.

ఐపీఎల్ లో టాప్ 5 వీరే..

ఈజీగా సిక్సులు కొట్టగల సామర్థ్యం ఉన్న క్రికెటర్లలో క్రిస్ గేల్ ఒకరు. ఈ వెస్టిండీస్ క్రికెటర్ ఇంటర్నేషనల్ మ్యాచులతో పాటు ఐపీఎల్ లో కూడా రాణించాడు. ప్రస్తుతం రిటైర్డ్ అయిన క్రిస్ గేల్ యూనివర్సల్ బాస్ గా పేరుపొందాడు. ముఖ్యంగా క్రిస్ గేల్ ఐపీఎల్ లో ఎక్కువ సిక్సులు బాదిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. క్రిస్ గేల్ ఐపీఎల్ లో మొత్తం మీద 300 సిక్సులు బాదాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ ఇప్పటివరకు 297 సిక్సులు బాదాడు. ఆ తర్వాత స్థానాల్లో విరాట్ కొహ్లీ, మహేంద్ర దోనీ, ఏబీ డివిలియర్స్ ఉన్నారు.

యూనివర్సల్ బాసే టాప్..

ప్రపంచ టీ 20 క్రికెట్ లో కూడా ఎక్కువ సిక్సులు బాదింది కూడా యూనివర్సల్ బాస్ కావడం గమనార్హం. క్రిస్ గేల్ టీ 20ల్లో మొత్తంగా 1056 సిక్సులు బాది తన పేరిట సరికొత్త రికార్డు క్రియేట్ చేసి పెట్టాడు. ఈ రికార్డుకు ఆమడ దూరంలో ఉన్నారు పోటీ క్రికెటర్లు. ప్రపంచంలో గేల్ తర్వాతనే సిక్సులు కొట్టడంలో మరేవరైనా అని చెప్పుకోవచ్చు. గేల్ తర్వాత మరో విండీస్ బ్యాట్స్ మెన్ కీరన్ పొలార్డ్ 908 సిక్సులు కొట్టి రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు. పొలార్డ్ ముంబయి టీంకు అసిస్టెంట్ కోచ్ గా ఉన్నాడు. క్రిస్ గేల్ మాత్రం హాయిగా సేదతీరుతుడున్నాడు.

టాప్ 10లో వీరే..

ప్రపంచ క్రికెట్ లో ఎక్కవ సిక్సులు బాదిన మొదటి నలుగురు క్రికెటర్లు కూడా విండీస్ ప్లేయర్లే కావడం గమనార్హం. క్రిస్ గేల్, పూరన్, పొలార్డ్, అండ్రీ రస్సెల్ ఉండగా.. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కొహ్లీ 20 స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ మొత్తం మీద టీ 20ల్లో 540 సిక్సులు బాదాడు. వీరితో పాటు జోస్ బట్లర్, అలేక్స్ హెల్స్ ఇంగ్లాండ్, నలుగురు విండీస్ క్రికెటర్లు, ఇండియా నుంచి రోహిత్ శర్మ. సౌతాఫ్రికా నుంచి డేవిడ్ మిల్లర్, ఆస్ట్రేలియా నుంచి గ్లెన్ మ్యాక్స్ వెల్, ప్రపంచ క్రికెట్ లో ఎక్కువ సిక్సులు బాదిన క్రికెటర్లలో టాప్ 10 స్థానాల్లో ఉన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now