GK: మనలో చాలామందికి చికెన్ తినడం అంటే చాలా ఇష్టం. అయితే కోడిని కొంతమంది ఇంట్లో పెంచుకున్నప్పటికీ దానిని ఎప్పుడెప్పుడు కోసుకొని తిందామా అని ఆలోచిస్తూ ఉంటారు. చికెన్ తో చాలా రకాల నోరూరించే వంటలను చేసుకోవచ్చు. అయితే ఇటువంటి కోడి కూడా ఒక దేశ జాతీయ పక్షి అని మనలో చాలామందికి తెలియదు అని చెప్పాలి. కోడి ఏ దేశానికి జాతీయ పక్షి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇది ఒక జ్ఞానాన్ని పెంచే జనరల్ నాలెడ్జ్ ప్రశ్న అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉద్యోగాలలో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అలాగే కరెంటు అఫైర్స్ వంటివి అడుగుతూ ఉంటారు.
ఈ విధంగా జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన ప్రశ్నలను తెలుసుకోవడం వలన మీకు దేశ విదేశాలకు సంబంధించిన అనేక సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఒక దేశానికి కోడి జాతీయ పక్షిగా పరిగణించబడుతుంది అనేది ఒక వింత ప్రశ్న అయినప్పటికీ కూడా ఇది చాలా సరైన ప్రశ్న. మనం ఎంతో ఇష్టంగా తినే కోడి కూడా ఒక దేశానికి జాతీయ పక్షిగా ఉంది. ఆ దేశం మనదేశానికి పొరుగు దేశం అయినా శ్రీలంక. శ్రీలంక దేశానికి జాతీయ పక్షి శ్రీలంక అడవి కోడి అనే విషయం మనలో చాలామందికి తెలియదు. గతంలో దీనినే సిలోన్ జంగిల్ ఫౌల్ అని కూడా పిలుచుకునేవారు.
అయితే ఇది కేవలం శ్రీలంక అడవులలో మాత్రమే దొరుకుతుంది. ఈ సర్వభక్షక పక్షి బనియన్ వంశానికి చెందిన జాతీయ పక్షి. దీనిని అడవి కోడి అని అంటారు. ఇది 35 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అలాగే 510 లేదా 645 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ జాతి కోడి కేవలం శ్రీలంక అడవులలో మాత్రమే దొరుకుతుంది. ఇది శ్రీలంక దేశానికి జాతీయ పక్షిగా పిలవబడుతుంది.