Temple: ఆలయానికి వెళ్లి వచ్చేటప్పుడు ఈ 3 పనులు చేయకూడదు.. అలా చేస్తే పుణ్యం వచ్చుడు ఏమో కానీ.. దోషాలు పెరిగిపోతాయి

Temple
Temple

Temple: చాలామందికి ప్రతిరోజు గుడికి వెళ్లే అలవాటు ఉంటుంది. ఇలా గుడికి వెళ్లడం వలన వాళ్ళ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది గుడికి వెళ్లి వచ్చినప్పుడు ఆధ్యాత్మిక తన్వయత్వంలో మునిగిపోతారు. వాళ్లలో ఓ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. గుడిలో వినిపించే వేదమంత్రాలు అలాగే ఘంటానాదం ఇవన్నీ కూడా మనస్సుతో చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. భగవంతుడికి నైవేద్యం సమర్పించడం అలాగే హారతి కళ్ళకు అడ్డుకోవడం వంటివి మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే గుడికి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో కొన్ని పొరపాటులను చేయకూడదు అని పండితులు చెప్తున్నారు. ఈ పొరపాట్లు తెలిసి తెలియక చేయడం వలన దోషం కూడా కలిగే అవకాశం ఉంది.

సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా గుడి లోపలికి వెళ్లిన తర్వాత గంట కొడతారు. మరి కొంతమంది గుడి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు కూడా గంటను కొడుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు అని పండితులు చెప్తున్నారు. గుడి లోపలికి ప్రవేశించినప్పుడు మాత్రమే గంట కొడితే మన జీవితంలో సానుకూల శక్తి ఏర్పడుతుందని ప్రతికూల శక్తి నశించిపోతుందని అందరి నమ్మకం. ఒకవేళ మీరు గుడి నుండి తిరిగి వెళ్లేటప్పుడు గంట కొట్టినట్లయితే ఆ సానుకూల శక్తి అక్కడే ఉండిపోతుంది అని చెప్తున్నారు.

అలాగే గుడి లోపలికి వెళ్ళేటప్పుడు పూలు పండ్లతో పాటు అగర్బత్తిలో నైవేద్యాలను కూడా తీసుకొని వెళ్తారు. వాటన్నిటిని దేవుడికి సమర్పిస్తారు. అలాగే గుడి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఖాళీ చేతులతో వెళ్లకూడదు. ప్రసాదం లేదా కొన్ని పువ్వులను అయినా ఇంటికి తీసుకొని వెళ్ళాలి. గుడి నుంచి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లడం శుభప్రదంగా పరిగణించరు. కొంతమంది గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు చేతులు కడుక్కుంటూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదు. ఒకవేళ మీ కాళ్లు మురికిగా ఉన్నట్లయితే వాటిని ఒక గుడ్డతో తుడుచుకోవాలి. అంతేగాని కాళ్లను నీటితో కడగకూడదు అని పండితులు చెప్తున్నారు. గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు చేతులు కనుక్కోవడం వలన సానుకూల శక్తి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now