Curry Leaf Plant: ఇంట్లో కరివేపాకు మొక్కను ఈ దిశలో పెంచితే ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలో తెలుసా..!

Curry Leaf Plant
Curry Leaf Plant

Curry Leaf Plant: ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం అనేది ఆ ఇంటికి అందంతోపాటు వాస్తు శాస్త్రం ప్రకారం సానుకూల మార్పులను కూడా తెచ్చి పెడతాయి. అయితే ఇంట్లో ఏ రకమైన మొక్కలను పెంచాలి అలాగే ఏ దిశలో పెంచాలి అనే సందేహం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం వేపచెట్టు ఇంటి ఆవరణలో పెంచితే చాలా సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి అని నిపుణులు చెప్తున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో కరివేపాకు మొక్కను పెంచడం వలన కూడా చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయట.

కానీ ఇంటి ఆవరణలో కరివేపాకు మొక్కను ఏ దిశలో పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి ఆవరణలో కరివేపాకు మొక్కను పెంచుకోవచ్చా లేదా అనే సందేహం మనలో చాలామందికి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కరివేపాకు మొక్కని పెంచడం చాలా శుభప్రదంగా చెబుతారు. కేవలం ఇది ఆరోగ్య ప్రయోజనాలకే కాకుండా ఆ ఇంట్లో సంపదను అలాగే సంతోషాన్ని కూడా కలిగిస్తుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో పెంచుకునే కరివేపాకు మొక్క ఆ ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించే సానుకూల శక్తి పెరిగేలాగా చేస్తుంది. ఇంట్లో ఇది సుఖ సంతోషాలను పెరిగేలా చేస్తుంది.

ఇంటి ఆవరణలో కరివేపాకు మొక్కలను సరైన దిశలో నాటడం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనం కూడా కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా బాగా మెరుగుపడుతుంది. ఈ మొక్క ఉండటం వలన ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. కరివేపాకు ఆకులలో ఉండే యాంటీ న్యూటాజెనిక్ గుణాలు క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో బాగా ఉపయోగపడతాయి. ఇంట్లో కరివేపాకు మొక్కలను నాటడానికి అత్యంత అనుకూలమైన దిశ పడమర దిశ. ఇది సెలవు కరివేపాకు మొక్కలు నాటడం వలన ఆ ఇంట్లో అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి అని నమ్ముతారు. అలాగే ఆగ్నేయ దిశ కూడా కరివేపాకు మొక్కని పెంచడానికి చాలా శుభ ప్రదమని సూచిస్తున్నారు. కానీ ఈశాన్య దిశలో ఈ మొక్కను అసలు పెట్టకూడదు. ఈ దిశలో పెట్టడం వలన ఆ ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now