Home తాజా వార్తలు Indian Railways: రైలు బోగీలపై ఉండే ఈ 5 అంకెల నెంబర్ వెనుక ఎంత పెద్ద...

Indian Railways: రైలు బోగీలపై ఉండే ఈ 5 అంకెల నెంబర్ వెనుక ఎంత పెద్ద అర్థం ఉందో తెలిస్తే షాక్ అవుతారు

Indian Railways
Indian Railways

Indian Railways: మనదేశంలో ఉన్న అతిపెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. ప్రతిరోజు ఎన్నో లక్షల మంది రైలులో ప్రయాణం చేస్తూ ఉంటారు. మన దేశా రైల్వేలు ప్రపంచవ్యాప్తంగా నాలుగువ స్థానంలో ఉన్నాయి. రైల్వేలలో మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. మనం స్టేషన్ లోకి అడుగుపెట్టిన వెంటనే మనకు రకరకాల అంశాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటి అర్థం ఏంటో మనలో చాలామందికి తెలియదు. ప్రతి రైళ్లపై కూడా కొన్ని నెంబర్లు రాసి ఉంటాయి.

వాటి అర్థం ఏంటో కూడా మనలో చాలామందికి తెలియదు అని చెప్పాలి. ప్రతి రైలుపై కూడా ఐదు నెంబర్లు రాసి ఉండడాన్ని మీరు చూసే ఉంటారు. ఈ సంఖ్య ప్రతి భోగి లోపల కూడా రాసి ఉంటుంది. అయితే ఈ సంఖ్య ఎందుకు రాస్తారో, దాని అర్థం ఏమిటో చాలామందికి తెలియదు. మనదేశంలో వేల సంఖ్యలో రైలు వివిధ మార్గాలలో ప్రయాణిస్తుంటాయి. ఈ క్రమంలో ఆ రైలును గుర్తించడానికి ఐదు అంకెల నెంబర్ను ఇస్తారు.

అయితే రైలు బోగి పై రాసి ఉన్న ఈ ఐదు అంకెల సంఖ్యలో మొదటి రెండు అంకెలు కోచ్ తయారు చేసిన సంవత్సరాన్ని సూచిస్తుంది. మిగిలిన మూడు సంఖ్యలు ఆ గది వర్గాన్ని సూచిస్తాయి. మీకు అర్థం అయ్యేలాగా చెప్పాలంటే ఒకవేళ మీరు ఎక్కిన రైలు భోగి నెంబర్ 22358 ఉన్నట్లయితే, దీని అర్థం మొదటి రెండు అంకెలు 22 కాబట్టి ఆ రైలు భోగి 2022లో తయారయిందని అర్థం. మీరు ఎక్కిన కంపార్ట్మెంట్ స్లీపర్ కోచ్. చివరి మూడు అంకెలు మీరు ఏ తరగతి గదిలో ప్రయాణిస్తున్నారో తెలుపుతుంది. అంటే మీరు ఎక్కింది ఏసీలోనా లేదా స్లీపర్ లోనా అనే దానిని చివరి మూడు అంకెలు సూచిస్తాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now