TAX RULES: ఇంట్లో బంగారం, నగదు ఎంత ఉండొచ్చు తెలుసా.. ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు ఏంటి

TAX RULES
TAX RULES

TAX RULES: అయితే చాలామందికి ఇంట్లో నగదు ఉంచుకోవడంపై ఎంత పరిమితి ఉంటుందో తెలియదు. అయితే ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఇంట్లో నగదు ఉంచుకోవడంపై ఎటువంటి పరిమితిని పెట్టలేదు. ఆదాయపు పన్ను శాఖ వారు పెద్ద మొత్తంలో నగలు, ఆభరణాలు ఉన్న ఇంట్లో సోదా చేసి వాటిని స్వాధీనం చేసుకోవడం గురించి అనేకసార్లు వినే ఉంటారు. అటువంటి సందర్భాలలో ఆదాయపు పన్ను శాఖ వాళ్ళు నగదు మరియు నగలను స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో వాటికి సంబంధించిన వ్యక్తిని కూడా అరెస్టు చేస్తారు. ఇటువంటి వార్తలు ప్రజల మనసులో అనేక ప్రశ్నలను తలెత్తేలా చేస్తాయి. ఇంట్లో ఎక్కువ మొత్తంలో నగదు లేదా ఆభరణాలను ఉంచుకోవడం చట్టబద్ధంగా నేరమా అంటూ చాలామందికి తలెత్తే ప్రశ్న.

అయితే మీడియా నివేదికల ప్రకారం ఇంట్లో నగదు పెట్టుకోవడంపై ఆదాయపు పని సేకరించి ఎటువంటి పరిమితి కూడా లేదు. మీరు ఇంట్లో ఎంత నగదు అయినా పెట్టుకోవచ్చు. కానీ పెద్ద మొత్తంలో ఇంట్లో డబ్బు ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉండాలి. ఈ ఆధారాల గురించి ఆదాయపు పన్ను రిటర్న్స్ లో తెలపాలి. ఆదాయపు పన్ను చట్టంలో ఉన్న 68 సెక్షన్ నుండి 69 బి సెక్షన్ వరకు మూలంలోని ఆదాయానికి సంబంధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఇంట్లో పెద్ద మొత్తంలో ఉన్న నగదు మూలాన్ని వివరించలేకపోతే దానికి మూలం లేని ఆదాయంగా ఆదాయపు పన్ను శాఖ వారు పరిగణిస్తారు.

ఇటువంటి వాటిపై భారీ జరిమానా కూడా విధిస్తారు. ఇటువంటి నగదు పై దాదాపు 78% పన్ను విధించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఇంట్లో బంగారాన్ని ఉంచుకోవడంపై పరిమితిని విధించారు. పురుషులకు, మహిళలకు ఈ పరిమితి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది బంధనాల ప్రకారం మీ ఇంట్లో బంగారాన్ని కొంత మొత్తంలో మాత్రమే పెట్టుకోవచ్చు. ఒకవేళ పరిమితికి మించి బంగారాన్ని పెట్టుకున్నట్లయితే దానికి సంబంధించిన రుజువులు ఆదాయపు పన్ను శాఖ వారికి అందించాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now