Tulsi plant: ఇంట్లో తులసి మొక్క ఉంటే.. అద్భుతమైన ప్రయోజనాలు ఏవో తెలుసా..!

Tulsi plant
Tulsi plant

Tulsi plant: హిందూ మత సాంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తులసి మొక్క చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ మొక్కను విష్ణువు లేదా లక్ష్మీదేవి స్వరూపంగా చాలామంది ఇంట్లో పెట్టుకుని పూజిస్తారు. ఇంట్లో ఈ మొక్క ఉండడం వలన ఆ ఇంట్లో సానుకూల శక్తితో పాటు దైవిక శక్తి కూడా ఉంటుంది అని చాలామందికి నమ్మకం. ముఖ్యంగా ఇంట్లో ఈ మొక్క ఈశాన్య దిశలో పెట్టుకున్నట్లైతే ఆ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి శాంతి మరియు సంపద ఇంట్లో కలుగుతుందని భావిస్తారు.

తులసి మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. గాలిని శుద్ధి చేయడంలో ఇది బాగా సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది. తులసి మొక్క నుంచి వచ్చే సుగంధం మానసిక ఒత్తిడిను తగ్గించడంలో సహాయం చేస్తుంది. కాబట్టి హిందువులు అందరూ కూడా తమ ఇంటి ఆవరణలో తప్పకుండా తులసి మొక్కను పెట్టుకొని ప్రతిరోజు దానిని భక్తితో పూజిస్తూ ఉంటారు. ఈ మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా అందరూ భావిస్తారు. ఈ మొక్క ఉన్న ఇంట్లో శ్రేయస్సు మరియు ఆనందం కలుగుతుందని నమ్ముతారు.

తులసి మొక్కలు లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు దీనిని పూజిస్తారు. విష్ణువుకు కూడా తులసి అంటే చాలా ఇష్టం. ఈ మొక్కను హరిప్రియ అని కూడా అంటారు. విష్ణువుకు నైవేద్యం పెట్టేటప్పుడు తులసి ఆకులను ఉపయోగిస్తారు. తులసి మొక్క ఉన్న ఇంట్లో విష్ణువు కూడా ఉంటాడు అని చాలామంది నమ్మకం. ఈ మొక్క ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. ఈ మొక్క ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంటి వాతావరణం మొత్తం చాలా స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక హిందూ పురాణాల ప్రకారం తులసి మొక్కను ఇంటి ఆవరణలో నాటుకొని పూజించడం వలన గత జన్మలో చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చాలామంది నమ్ముతారు. వాస్తు దోషాలతో పాటు పితృ దోషాలను తొలగించడంలో కూడా ఈ మొక్క బాగా సహాయపడుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now