Home బిజినెస్ Toll Plaza: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఈ కార్డు ఉంటే ఏ టోల్ ప్లాజాలో అయిన...

Toll Plaza: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఈ కార్డు ఉంటే ఏ టోల్ ప్లాజాలో అయిన వెళ్లొచ్చు.. ఆగస్టు 15 నుంచి అమలు

Toll Plaza
Toll Plaza

Toll Plaza: ప్రతిరోజు ఎన్నో వాహనాలు టోల్గేట్ గుండా ప్రయాణం చేస్తూ ఉంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా టోల్గేట్ గుండా ప్రయాణించే వాహనదారులకు ఒక వార్షిక పాస్ ప్రకటించింది. ఈ పాస్ పొందడం ద్వారా టోల్గేట్ గుండా ప్రయాణం చేసే వాహనదారులందరూ కూడా ఏడాది పొడవునా జాతీయ రహదారుల మీద ప్రయాణించవచ్చు. ఈ వార్షిక పాస ధర 3000 రూపాయలు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గట్కరి ఆగస్టు 15 నుంచి ఈ ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత పాస్ అమలులోకి వస్తుంది. దీని గురించి మాట్లాడుతూ రవాణా శాఖ మంత్రి ఏడాదికి 200 ట్రిప్పులు లేదా యాక్టివేట్ చేసిన తేదీ నుంచి ఏడాది పాటు ఈ పాస్ చెల్లుబాటు అవుతుందని తెలిపారు.

ఒకవేళ ఏడాది పూర్తవకముందే 200 ట్రిప్పులు పూర్తి అయితే కనుక ఈ పాస్ చెల్లుబాటు కాదు. హైవే ప్రయాణాన్ని చౌకగా మరియు సౌకర్యవంతంగా మార్చడానికి వాణిజ్యతర ప్రైవేట్ వాహనాల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. త్వరలో రాజ్ గార్ యాత్ర యాప్ తో పాటు ఎన్ హెచ్ ఏ ఐ, ఎం ఓ ఆర్ టి హెచ్ అధికారిక వెబ్సైట్లో ఈ పాస్ యాక్టివేషన్ అలాగే రెన్యువల్ కోసం ప్రత్యేక లింకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

వాహనదారుల దీర్ఘకాలిక ఆందోళనను పరిష్కరిస్తూ 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని టోల్ ప్లాజా లకు సంబంధించి ఇది బాగా పనిచేస్తుంది అని తెలిపారు. ఒక ఏడాదికి చెందిన చెల్లింపులను ఒకేసారి చేసి ఈ పాస్ పొందడం ద్వారా ఏడాది పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా ప్రయాణం చేయవచ్చు. ముఖ్యంగా ఇది టోల్గేట్ ల వద్ద వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు కూడా బాగా సహాయపడుతుంది. ఈ పాస్ పొందడం ద్వారా టోల్ ప్లాజా దగ్గర గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now