Vastu Tips: పావురాలకు ఆహారం పెట్టడం దేనికి సంకేతమో తెలుసా.. ఇలా చేయడం వల్ల ఏమి జరుగుతుందంటే

Vastu Tips
Vastu Tips

Vastu Tips: చాలామంది పావురాలకు ఆహారం పెడుతూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పావురాలకు ఆహారం పెట్టడం వలన కూడా చాలా మంచి జరుగుతుంది అని చాలామందికి తెలియదు. కానీ ఇలా పావురాలకు ఆహారం పెట్టడం వలన చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని వాస్తు శాస్త్రా నిపుణులు చెప్తున్నారు. ఇలా చేయడం వలన ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు కూడా కలుగుతాయని నమ్ముతారు. నిత్యం పావురాలకు ఆహారం పెట్టడం వలన రాహు కేతు దోషాల నుంచి కూడా విముక్తి పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

హిందూమత శాస్త్రంలో ముఖ్యంగా మూగ జంతువులకు అలాగే పక్షులకు సేవ చేయడం వలన చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెప్పబడింది. అలాగే పావురాలకు ఆహారం పెట్టడం వలన ముఖ్యంగా రాహువు, కేతువు మరియు శని వంటి చెడు గ్రహాల నుంచి శాంతి పొందవచ్చు. జీవితంలో శత్రువుల అడ్డంకులు లేదా మానసిక ఒత్తిడి వంటివి తగ్గుతాయి. పావురాలకు ప్రతిరోజు పప్పులు లేదా ధాన్యాలు వంటివి వేయడం వలన జీవితంలో ఉన్న సమస్యలన్నిటి నుంచి ఉపశమనం పొందవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. పావురాలకు ధాన్యం వేస్తే అవి ప్రతికూల శక్తిని గ్రహిస్తాయి.

ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం మూగజీవాలకు పక్షులకు ఆహారం లేదా నీరు ఇచ్చినట్లయితే అవి ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని గ్రహిస్తాయి.ఎవరిదైనా జాతకంలో శని ఉన్నట్లయితే వాళ్లు శనివారం రోజున పావురాలకు మినప్పప్పు లేదా నల్ల నువ్వులు పెట్టడం వలన వాళ్ళ జాతకంలో ఉన్న శని దోషం తొలగిపోతుంది. అలాగే జాతకంలో రాహు కేతు లేదా కాలసర్ప దోషంతో బాధపడుతున్న వారు ప్రతి రోజు పావురాలకు ఆహారం పెట్టడం వలన ఆ దోషాలు తొలగిపోతాయి. ఇలా చేయడం వలన గందరగోళం నుంచి అలాగే మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. పక్షులకు ధాన్యాలు పెట్టడం వలన ముఖ్యంగా మన పూర్వీకులు కూడా చాలా సంతృప్తి చెందుతారు అని నిపుణులు చెప్తున్నారు. ఇలా చేయడం వలన పితృ దోషం కూడా తొలగిపోతుంది. మూగజీవాలకు పక్షులకు ప్రతిరోజు ఆహారం పెట్టడం వలన ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇటువంటి వారు ఇంట్లో ఎప్పటికీ ఆర్థిక సమస్యలను ఎదుర్కోరు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now