Vastu Tips: జ్యోతిష శాస్త్రానికి అలాగే వాస్తు శాస్త్రానికి మన జీవితంలో చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలి అనే నిపుణులు చెప్తున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం నిపుణులు మూడు రకాల వాల్ పేపర్స్ మొబైల్ ఫోన్ లో పెట్టుకోకూడదు అని సూచిస్తున్నారు. ఇవి పెట్టుకోవడం వలన మీ జీవితంలో ప్రతి కుల శక్తి పెరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మన చుట్టుపక్కల ఉండే ప్రతి వస్తువు కూడా దాని సరైన దిశలో లేకపోతే అది మీ జీవితంలో అలాగే ఇంట్లో కూడా ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. కాబట్టి ఏ పని చేసినా కూడా ముందుగా వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి.
అది కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కాదు మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లో కూడా వాస్తు శాస్త్రం వర్తిస్తుంది. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక ముఖ్యమైన అవసరంగా మారిపోయింది. అందుకే మొబైల్ ఫోన్ విషయంలో కూడా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఫోన్లో ఈ మూడు రకాల వాల్ పేపర్స్ ను పొరపాటున కూడా పెట్టుకోకూడదు. కొంతమంది తమ భావోద్వేగాల ప్రకారం తమ ఫోన్లో వాల్పేపర్ పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం వలన వారి వ్యక్తిత్వ మరియు జీవితంపై కూడా ప్రభావం ఉంటుంది.
మన జీవితంలో మనం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగడానికి అలాగే మన జీవితంలో పాజిటివ్ వైస్ క్రియేట్ అవ్వడానికి మన ఫోన్లో స్క్రీన్ పై పెట్టే వాల్ పేపర్ కూడా చాలా ముఖ్యం. చాలామంది ఎటువంటి ప్రదేశాలకు వెళ్లినా కూడా ఫోన్ చేతిలో పట్టుకొని వెళతారు. మురికి ప్రదేశాలలో, బాత్రూంలో లేదా దహన సంస్కారాలలో ఇలా ప్రతి చోట కూడా ఫోన్ తీసుకొని వెళ్తారు. కాబట్టి ఫోన్ పై పొరపాటున కూడా మతపరమైన స్థలం లేదా దేవాలయాల ఫోటోలు పెట్టకూడదు. ఈ విధంగా ఫోన్ వాల్పేపర్ గా దేవతలను పెట్టడం వలన వాళ్లను అవమానించడం అవుతుందట. చాలామంది విచారణ, మరణం, కోపం లేదా అసూయ ఇలా స్థితిని బట్టి వాల్పేపర్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇలా భావోద్వేగాలతో కూడిన వాల్ పేపర్లను ఫోన్ మీద పెట్టకూడదు అని నిపుణులు చెప్తున్నారు. ఇలా పెట్టుకోవడం వలన జీవితంలో నిరాశ చెంది ప్రతికూల శక్తి పెరుగుతుంది.