Fatal road accident: జగిత్యాల జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 15 (ప్రజా శంఖారావం): జగిత్యాల జిల్లా రూరల్ పరిధిలోని పొలాస వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 2 ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now