Property: మీరు కొంటున్న ఆస్తి నిజమైనదా లేదా నకిలీదా.. ఇలా సులభంగా తెలుసుకోండి

Property
Property

Property: చాలామంది నగరాల్లో భూమి లేదా ఇల్లు కొనాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు. తమకు వచ్చిన ఆదాయంలో పైసా పైసా కూడబెట్టుకొని అలాగే బ్యాంకులో లోన్ తీసుకొని ఆస్తిని కొనుగోలు చేస్తారు. కానీ ఆ తర్వాత వాళ్ళు అనేక కారణాల వలన మోసపోతూ ఉంటారు. అయితే భూమి లేదా ఇల్లు కొనేముందు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఆస్తి కొనేముందు మోసపోకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది ఆస్తి గురించి ఎటువంటి దర్యాప్తు కూడా చేయకుండా కొనుగోలు చేసి ఆ తర్వాత మోసపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇటీవల కాలంలో కూడా నకిలీ రిజిస్ట్రేషన్ ల ద్వారా భూములు లేదా ఇల్లు అమ్మిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. కాబట్టి మీరు కొంటున్న ఆస్తి నిజమైనదా లేదా నకిలీదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు కొంటున్న ఆస్తి అసలైనదో కాదో ఈ సులభమైన మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు. భూమి లేదా ఇల్లు రిజిస్ట్రేషన్ లను తనిఖీ చేయడానికి ప్రతి రాష్ట్రం కూడా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీరు ఇంట్లో నుంచే ప్రమాణికతను సులభంగా తెలుసుకోవచ్చు.

అలాగే భూమికి సంబంధించిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య నెంబర్ ద్వారా కూడా మీ రాష్ట్రం యొక్క భూ రికార్డులో వెబ్సైట్లో ఈ కసర నెంబర్ను ఎంటర్ చేసి ఆస్తి నిజమైనదో కాదో తెలుసుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేయడం వలన మీకు భూమి యజమాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది. లోన్ రీపేమెంట్ సర్టిఫికెట్ ద్వారా కూడా ఆస్తిపై ఏవైనా లోన్ ఉన్నాయా లేదా చట్టపరమైన వివాదాలు ఏమైనా ఉన్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు. దీనికోసం మీరు మీకు సమీపంలో ఉన్న రిజిస్టర్ కార్యాలయం లేదా అధికారిక వెబ్సైట్లో ఈ సర్టిఫికెట్ను సులభంగా పొందవచ్చు. ఒకవేళ మీకు ఆన్లైన్ పోర్టల్ లో సరైన సమాచారం లభించకపోతే సమీప రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now