Gas Cylinder: ఇకపై గ్యాస్ సిలిండర్లు మీ ఇంటికి డెలివరీ చేయరు…కారణం ఇదే

Gas Cylinder
Gas Cylinder

Gas Cylinder: తాజాగా ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎల్పిజి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి మరో ఎదురు దెబ్బ తగలబోతుంది. తాజాగా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ లో యూనియన్ ప్రభుత్వానికి సమ్మె హెచ్చరికను జారీ చేసింది. ఆదివారం రోజున యూనియన్ తమ డిమాండ్లను మూడు నెలల్లో పూర్తి చేయకపోతే సమ్మెకు దిగుతామని నివేదికను ప్రకటించింది.

అదే కనుక జరిగితే గ్యాస్ సిలిండర్ ఇంటికి డెలివరీ చేయడంలో అంతరాయం కూడా ఏర్పడవచ్చు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచింది. తాజాగా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ల సంఘం తమ డిమాండ్లను పూర్తిచేయాలని ఆందోళనకు దిగింది. మూడు నెలల లోపు మా డిమాండ్లను ముఖ్యంగా అధిక కమిషన్ తీర్చకపోతే మేము సమ్మెకు దిగుతాం అంటూ ఎల్పిజి గ్యాస్ సిలిండర్లా సంఘం ప్రభుత్వానికి హెచ్చరించింది.

అసోసియేషన్ అధ్యక్షుడు అయిన బిఎస్సి శర్మ తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం రోజున భోపాల్ లో జరిగిన అసోసియేషన్ జాతీయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సభ్యులు డిమాండ్ లేక పై ప్రతిపాదనను ఆమోదించారని తెలిపింది. అలాగే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటీ వల్ల డిమాండ్ల విషయం గురించి పెట్రోలియం మరియు ప్రకృతిక వాయువు మంత్రిత్వ శాఖకు కూడా లేఖన అందజేశామని తెలిపారు.

ప్రస్తుతం ఎల్పిజి కమిషన్ తక్కువగా ఉందని ఆ కమిషన్ ఆపరేటింగ్ ఖర్చులకు కూడా సరిపోవడంలేదని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇంటికి ఎల్పిజి సిలిండర్ డెలివరీ పై కనీస కమిషన్ 150 రూపాయలు ఉండాలని ఎల్పిజి గ్యాస్ సిలిండర్ యూనియన్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లేఖలో తెలిపింది. గ్యాస్ సిలిండర్ లో సరఫరా డిమాండ్ సప్లై ఆధారంగా ఉన్నా కూడా చమరు సంస్థలు డిమాండ్ లేకపోయినా డిస్ట్రిబ్యూటర్లకు గృహ వినియోగేతర సిలిండర్లను బలవంతంగా పంపిస్తున్నాయని తెలిపింది. ఈ విధంగా చేయడం చట్ట విరుద్ధమని వెంటనే దీనిని ఆపివేయాలని యూనియన్ ప్రభుత్వానికి కోరింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now